రంజీఫైనల్లో 13 ఏళ్ల తర్వాత బెంగాల్
సెమీఫైనల్లో కర్ణాటకపై 174 పరుగుల గెలుపు దేశవాళీ క్రికెట్ చాంపియన్లకు ఇచ్చే రంజీట్రోఫీ ఫైనల్స్ కు బెంగాల్ 13 సంవత్సరాలవిరామం తర్వాత అర్హత సంపాదించింది. కోల్ కతా ఈడెన్ గార్డెన్స్ వేదికగా ముగిసిన తొలిసెమీఫైనల్లో బెంగాల్ 174 పరుగుల భారతేడాతో మాజీ చాంపియన్, హాటే ఫేవరెట్ కర్ణాటకను చిత్తు చేసింది. కెఎల్ రాహుల్, మనీష్ పాండే, కరుణ్ నాయర్ లాంటి స్టార్ ప్లేయర్లున్న కర్ణాటక…బెంగాల్ పేసర్ల ముప్పేటదాడికి కకావికలైపోయింది. తొలిఇన్నింగ్స్ లో యువఫాస్ట్ బౌలర్ ఇషాన్ పోరెల్ 5 వికెట్లు […]
- సెమీఫైనల్లో కర్ణాటకపై 174 పరుగుల గెలుపు
దేశవాళీ క్రికెట్ చాంపియన్లకు ఇచ్చే రంజీట్రోఫీ ఫైనల్స్ కు బెంగాల్ 13 సంవత్సరాలవిరామం తర్వాత అర్హత సంపాదించింది. కోల్ కతా ఈడెన్ గార్డెన్స్ వేదికగా ముగిసిన తొలిసెమీఫైనల్లో బెంగాల్ 174 పరుగుల భారతేడాతో మాజీ చాంపియన్, హాటే ఫేవరెట్ కర్ణాటకను చిత్తు చేసింది.
కెఎల్ రాహుల్, మనీష్ పాండే, కరుణ్ నాయర్ లాంటి స్టార్ ప్లేయర్లున్న కర్ణాటక…బెంగాల్ పేసర్ల ముప్పేటదాడికి కకావికలైపోయింది. తొలిఇన్నింగ్స్ లో యువఫాస్ట్ బౌలర్ ఇషాన్ పోరెల్ 5 వికెట్లు పడగొడితే…రెండో ఇన్నింగ్స్ లో ముకేశ్ కుమార్ 6 వికెట్లు సాధించి మ్యాచ్ విన్నర్ గా నిలిచాడు.
బెంగాల్ తొలిఇన్నింగ్స్ లో 312, రెండో ఇన్నింగ్స్ లో 161 స్కోర్లు సాధించగా…కర్ణాటక 122, 177 పరుగుల స్కోర్లు మాత్రమే నమోదు చేయగలిగింది.
2006-07 సీజన్లో చివరిసారిగా రంజీట్రోఫీ ఫైనల్స్ చేరిన బెంగాల్…తిరిగి మరోసారి ఫైనల్స్ చేరడానికి 13 సంవత్సరాల పాటు వేచిచూడాల్సి వచ్చింది. 1990లో చివరిసారిగా రంజీటైటిల్ నెగ్గిన బెంగాల్ మరోసారి విజేతగా నిలవాలన్న పట్టుదలతో ఉంది.
మార్చి 9నుంచి 13 వరకూ జరిగే ఫైనల్లో బెంగాల్ తరపున వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ వృద్ధిమాన్ సాహా, ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ సైతం బరిలోకి దిగే అవకాశాలున్నాయి
సౌరాష్ట్ర్రతో టైటిల్ ఫైట్….
రాజ్ కోటలోని సౌరాష్ట్ర్ర క్రికెట్ స్టేడియం వేదికగా జరుగుతున్న రెండో సెమీఫైనల్లో గుజరాత్ పైన విజయానికి ఆతిథ్య సౌరాష్ట్ర్ర మార్గం సుగమం చేసుకొంది.
మ్యాచ్ నెగ్గాలంటే ఆఖరిరోజు ఆటలో గుజరాత్ తన రెండో ఇన్నింగ్స్ లో మరో 320 పరుగులు చేయాల్సి ఉంది. చేతిలో 9 వికెట్లు మాత్రమే ఉన్నాయి.