జగన్ సలహాదారుగా సుభాష్... ఈయన హిస్టరీ తెలుసా?
పరిపాలనలో అనుభవం ఉన్న వారిని తన సలహాదారులుగా నియమించుకుంటున్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్. అందులో భాగంగా.. సీనియర్ అధికారి, కేంద్ర స్థాయిలో పని చేసిన సుభాష్ చంద్ర గార్గ్ ను.. తన అడ్వైజర్ గా అపాయింట్ చేశారు. సంక్షేమ పథకాల అమలుకు కీలకమైన నిధుల సమీకరణ బాధ్యతలను ఆయన చేతికి ఇచ్చారు. వేల కోట్ల రూపాయలతో ముడి పడి ఉన్న ఈ వ్యవహారాన్ని జగన్.. ఆయనకే ఎందుకు అప్పగించారు.. అసలు సుభాష్ చంద్ర గార్గ్ కు ఆ […]
పరిపాలనలో అనుభవం ఉన్న వారిని తన సలహాదారులుగా నియమించుకుంటున్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్. అందులో భాగంగా.. సీనియర్ అధికారి, కేంద్ర స్థాయిలో పని చేసిన సుభాష్ చంద్ర గార్గ్ ను.. తన అడ్వైజర్ గా అపాయింట్ చేశారు. సంక్షేమ పథకాల అమలుకు కీలకమైన నిధుల సమీకరణ బాధ్యతలను ఆయన చేతికి ఇచ్చారు.
వేల కోట్ల రూపాయలతో ముడి పడి ఉన్న ఈ వ్యవహారాన్ని జగన్.. ఆయనకే ఎందుకు అప్పగించారు.. అసలు సుభాష్ చంద్ర గార్గ్ కు ఆ దిశగా ఉన్న అర్హతలేంటన్నది పరిశీలిస్తే.. గతంలో కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శిగా పని చేసిన అనుభవం ప్రధాన కారణంగా విశ్లేషించవచ్చు. జాతీయ స్థాయిలో ఉన్న పరిస్థితులపై అవగాహన.. సంక్లిష్ట సమయాల్లో సమర్థ నిర్వహణ.. తదితరాలు గార్గ్ బలాలుగా నిలిచాయి.
రాష్ట్రంలో ప్రస్తుతం లోటు బడ్జెట్ ఉండడం.. అయినా సంక్షేమ పథకాలకు దాదాపు 50 వేల కోట్ల రూపాయలు వెచ్చిస్తుండడం.. వాటికి నిధుల సమీకరణలో సీనియర్ల సేవలు అవసరం అవుతున్న కారణంగానే ముఖ్యమంత్రి ఈ నిర్ణయం తీసుకున్నట్టు స్పష్టమవుతోంది. ప్రస్తుతం రాష్ట్రం లోటు బడ్జెట్ లో ఉన్న తరుణంలో ఇలాంటి అధికారుల సేవలు అత్యవసరమని జగన్ భావిస్తున్నట్టుగా తాజా నియామకం స్పష్టం చేస్తోంది.
సుభాష్ మాత్రమే కాకుండా.. ఆర్థిక శాఖకు మరో కార్యదర్శిగా ఐఏఎస్ కార్తికేయ మిశ్రాను నియమించిన ప్రభుత్వం.. ఈ ఇద్దరూ కలిసి పని చేసి.. నిధుల సమీకరణలో సమస్యలు రాకుండా చూసే బాధ్యతలు అప్పగించింది.