Telugu Global
NEWS

టీడీపీలో స్పష్టమైన మార్పు... ఇదే తాజా ఉదాహరణ

తెలుగుదేశం పార్టీ పరిస్థితి ప్రస్తుతం సంధికాలంలో ఉంది. తెలంగాణలో దాదాపుగా కనుమరుగై… ఆంధ్రప్రదేశ్ లో ఉనికి కోసం పోరాడుతున్న ఆ పార్టీ… అస్తిత్వ ముప్పుపై ఆందోళన చెందుతోంది. ఇటీవలి శాసనసభ ఎన్నికల్లో చరిత్రాత్మక తీర్పు ఇచ్చిన ప్రజలు.. వైసీపీకి 150కి పైగా సీట్లు కట్టబెట్టి.. క్లీన్ స్వీప్ లాంటి ఫలితాలు ఇచ్చారు. తెలుగుదేశాన్ని పాతిక స్థానాల లోపునకే పరిమితం చేసి.. ఆ పార్టీ ఉనికిని ప్రశ్నార్థకం చేశారు. అయినప్పటికీ చంద్రబాబు మేలుకోలేదన్న ఆరోపణలు.. స్వయంగా ఆ పార్టీ […]

టీడీపీలో స్పష్టమైన మార్పు... ఇదే తాజా ఉదాహరణ
X

తెలుగుదేశం పార్టీ పరిస్థితి ప్రస్తుతం సంధికాలంలో ఉంది. తెలంగాణలో దాదాపుగా కనుమరుగై… ఆంధ్రప్రదేశ్ లో ఉనికి కోసం పోరాడుతున్న ఆ పార్టీ… అస్తిత్వ ముప్పుపై ఆందోళన చెందుతోంది.

ఇటీవలి శాసనసభ ఎన్నికల్లో చరిత్రాత్మక తీర్పు ఇచ్చిన ప్రజలు.. వైసీపీకి 150కి పైగా సీట్లు కట్టబెట్టి.. క్లీన్ స్వీప్ లాంటి ఫలితాలు ఇచ్చారు. తెలుగుదేశాన్ని పాతిక స్థానాల లోపునకే పరిమితం చేసి.. ఆ పార్టీ ఉనికిని ప్రశ్నార్థకం చేశారు.

అయినప్పటికీ చంద్రబాబు మేలుకోలేదన్న ఆరోపణలు.. స్వయంగా ఆ పార్టీ నుంచే వినిపించాయి. జేసీ దివాకర్ రెడ్డి లాంటి నాయకులు చేసిన వ్యాఖ్యలు కావొచ్చు.. ఉన్న ఎమ్మెల్యేలు కూడా పార్టీకి దూరంగా నడుచుకుంటున్న పరిణామాలు కావొచ్చు.. ఈ దిశగా అనేకంగా ఉదాహరణలు ఉన్నాయి. అందుకే.. తెలుగుదేశం అధిష్టానం తన వైఖరిలో మార్పు తీసుకున్నట్టే కనిపిస్తోంది.

యువతకు అవకాశాలు ఇవ్వాలన్న ఆలోచన ఆ పార్టీలో మొదలైంది. అందుకే.. పార్టీకి చెందిన యువ నేతలతో అధినేత చంద్రబాబు కుటుంబం సమావేశమైంది. పార్టీని నడిపించాల్సింది మీరే.. అన్న సంకేతాన్ని చంద్రబాబు వారికి ఇవ్వడం జరిగింది. పార్టీని ముందుకు తీసుకుపోయే బాధ్యతనూ చంద్రబాబు వారికి అప్పగించినట్టుగా వార్తలు వస్తున్నాయి. అంతా బానే ఉంది.. కానీ.. యువ నాయకత్వం అంటే ఏంటి.. అన్న ప్రశ్న రాజకీయ వర్గాల నుంచి వ్యక్తమవుతోంది.

జాతీయ స్థాయిలో పార్టీ వాణిని బలంగా వినిపిస్తున్న ఎంపీ రామ్మోహన్ నాయుడును యువ నాయకుడిగా భావిస్తారో.. లేక టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అయిన లోకేష్ ను యువ నాయకుడిగా భావిస్తారో చంద్రబాబు చెబితే బాగుంటుందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. సందేశం ఇవ్వడం వేరు.. కార్యాచరణ వేరు అని.. చంద్రబాబు ముందుగా యువ నాయకత్వం వైపు కార్యాచరణ మొదలు పెడితే మంచిదన్న సూచనలు అందుతున్నాయి.

First Published:  2 March 2020 8:36 AM GMT
Next Story