Telugu Global
NEWS

లోకేష్ కోసం... బాబు పాట్లు

2019 ఎన్నికల్లో ఓటమి తర్వాత టీడీపీ అధినేత చంద్రబాబు నిరాశలో కూరుకుపోతున్నారు. అమరావతి సహా వివాదాస్పద అంశాల్లో ఒక వర్గం…. ప్రాంతం, యువతకు ప్రధానంగా దూరమైపోతున్నారన్న చర్చ టీడీపీలో సాగుతోంది. అదే సమయంలో సీఎం జగన్ కు యువతలో విపరీతమైన క్రేజ్ వస్తోంది. యంగ్ సీఎం కావడం.. వయసు తక్కువగా ఉన్నందుకు సీఎం జగన్ తో వృద్ధుడైన చంద్రబాబు అందుకోలేకపోతున్నాడు. 2004, 2009 ఎన్నికల్లో ఓడినప్పుడు చంద్రబాబు నిరాశ పడలేదు. కానీ ఈసారి ఓటమి, ఆయన వయసు […]

లోకేష్ కోసం... బాబు పాట్లు
X

2019 ఎన్నికల్లో ఓటమి తర్వాత టీడీపీ అధినేత చంద్రబాబు నిరాశలో కూరుకుపోతున్నారు. అమరావతి సహా వివాదాస్పద అంశాల్లో ఒక వర్గం…. ప్రాంతం, యువతకు ప్రధానంగా దూరమైపోతున్నారన్న చర్చ టీడీపీలో సాగుతోంది.

అదే సమయంలో సీఎం జగన్ కు యువతలో విపరీతమైన క్రేజ్ వస్తోంది. యంగ్ సీఎం కావడం.. వయసు తక్కువగా ఉన్నందుకు సీఎం జగన్ తో వృద్ధుడైన చంద్రబాబు అందుకోలేకపోతున్నాడు.

2004, 2009 ఎన్నికల్లో ఓడినప్పుడు చంద్రబాబు నిరాశ పడలేదు. కానీ ఈసారి ఓటమి, ఆయన వయసు మీరడంతో ఆందోళన చెందుతున్నాడట. తిరిగి అధికారంలోకి తీసుకురావడం.. తన కుమారుడు లోకేష్ శక్తి సామర్థ్యాలు తలుచుకొని తలకుమించిన భారంగా భావిస్తున్నాడట. జూనియర్ ఎన్టీఆర్ ను దూరంగా పెట్టి.. టీడీపీలో రెండో స్థానంలోకి ఎవరినీ రాకుండా చేసి లోకేష్ ను మంత్రి, ప్రధాన కార్యదర్శిని చేసినా ఆశించిన ఫలితం చంద్రబాబుకు రాలేదు.

యువతరంలో లోకేష్ కంటే జగన్ కే ఎక్కువగా ఫాలోయింగ్ కనిపిస్తోంది. అందుకే యూత్ ఆకర్షణ కోసం చంద్రబాబు ప్రయత్నాలు ప్రారంభించాడట.. తాజాగా సోమవారం రాష్ట్రానికి చెందిన యువ నాయకులను, యువతను కలుసుకున్నాడు. వారితో మాట్లాడాడు. లోకేష్ ను భావి భవిష్యత్ నాయకుడిగా తీర్చిదిద్దుతానని ప్రకటించాడు.

లాల్ జాన్ భాష, ఎర్రన్నాయుడు, దేవేందర్ గౌడ్ వంటి నేతలు చంద్రబాబు తర్వాత నంబర్ 2 హోదా దక్కించుకున్నారు. అయితే ఆ తర్వాత బాబు రక్షణార్థం నేతలను దూరంగా పెట్టారు. అగ్రనాయకులుగా ఎదగనివ్వలేదు. లోకేష్ కు పరిణితి లేకపోవడంతో ఎదగకుండా పోయారు. అదే ఇప్పుడు టీడీపీలో నాయకత్వ లోపానికి దారితీసింది. లోకేష్ ను నాయకుడిగా తీర్చిదిద్దడానికి జగన్ కు ఉన్న యువత బలం… లోకేష్ కు అవసరమని తాజాగా వారితో భేటీ అవుతున్నారు. మరి ఇది ఫలిస్తుందా? లోకేష్ ఎదుగుతాడా? అన్నది చూడాలి.

First Published:  2 March 2020 7:40 AM IST
Next Story