Telugu Global
NEWS

ఖేలో ఇండియా విశ్వవిద్యాలయ క్రీడల విజేత పంజాబ్

భువనేశ్వర్ లో ముగిసిన 2020 ఖేలో ఇండియా గేమ్స్ కేంద్ర క్రీడామంత్రిత్వశాఖ…భారత గడ్డపై తొలిసారిగా నిర్వహించిన 2020 ఖేలో ఇండియా యూనివర్శిటీ గేమ్స్…భువనేశ్వర్ వేదికగా అట్టహాసంగా ముగిసాయి. గత పదిరోజులుగా సాగిన ఈ క్రీడల్లో పంజాబ్ విశ్వవిద్యాలయం జట్టు అత్యధిక బంగారు పతకాలతో ఓవరాల్ చాంపియన్ ట్రోఫీని అందుకొంది. మొత్తం 176 విశ్వవిద్యాలయాలకు చెందిన 4వేలమంది అథ్లెట్లు 17 రకాల క్రీడాంశాలలో 478 బంగారు పతకాలకోసం తలపడ్డారు. ఓవరాల్ టైటిల్ కోసం నువ్వానేనా అన్నట్లుగా సాగిన పోరులో పూనేకు […]

ఖేలో ఇండియా విశ్వవిద్యాలయ క్రీడల విజేత పంజాబ్
X
  • భువనేశ్వర్ లో ముగిసిన 2020 ఖేలో ఇండియా గేమ్స్

కేంద్ర క్రీడామంత్రిత్వశాఖ…భారత గడ్డపై తొలిసారిగా నిర్వహించిన 2020 ఖేలో ఇండియా యూనివర్శిటీ గేమ్స్…భువనేశ్వర్ వేదికగా అట్టహాసంగా ముగిసాయి.

గత పదిరోజులుగా సాగిన ఈ క్రీడల్లో పంజాబ్ విశ్వవిద్యాలయం జట్టు అత్యధిక బంగారు పతకాలతో ఓవరాల్ చాంపియన్ ట్రోఫీని అందుకొంది. మొత్తం 176 విశ్వవిద్యాలయాలకు చెందిన 4వేలమంది అథ్లెట్లు 17 రకాల క్రీడాంశాలలో 478 బంగారు పతకాలకోసం తలపడ్డారు.

ఓవరాల్ టైటిల్ కోసం నువ్వానేనా అన్నట్లుగా సాగిన పోరులో పూనేకు చెందిన సావిత్రిబాయి పూలే విశ్వవిద్యాలయాన్ని పంజాబ్ యూనివర్శిటీ జట్టు అధిగమించి.. చాంపియన్స్ ట్రోఫీ అందుకొంది.

పోటీల ఆఖరిరోజున రెండు బంగారు పతకాలు సాధించడం ద్వారా పంజాబ్ యూనివర్శిటీ ఓవరాల్ విజేతగా నిలిచింది. రెండుజట్లూ చెరో 17 స్వర్ణాలు సాధించి సమఉజ్జీలుగా నిలిచినా..మొత్తం సాధించిన పతకాల ప్రాతిపదికన పంజాబ్ ను విజేతగా ప్రకటించారు.

పంజాబ్ 17 స్వర్ణాలు,19 రజత, 10 కాంస్యాలతో సహా మొత్తం 46 పతకాలతో అగ్రస్థానంలో నిలిచింది. రన్నరప్ సావిత్రిబాయి పూలే యూనివర్శిటీ జట్టు మాత్రం 17 స్వర్ణ,11 రజత, 9 కాంస్యాలతో సహా 37 పతకాలతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.

33 పతకాలతో పాటియాలాకు చెందిన పంజాబ్ యూనివర్శిటీ జట్టు తృతీయస్థానం సంపాదించింది.

ద్యుతీ చంద్ కు డబుల్ గోల్డ్…

మహిళల 100, 200 మీటర్ల పరుగులో ఆతిథ్య కళింగ యూనివర్శిటీ ఆఫ్ టెక్నాలజీ అథ్లెట్ ద్యుతీ చంద్ డబుల్ గోల్డ్ తో తనకుతానే సాటిగా నిలిచింది.

పురుషుల కబడ్డీ బంగారు పతకం పోటీలో గురునానక్ దేవ్ జట్టు 33-31 పాయింట్ల తేడాతో కురుక్షేత్ర విశ్వవిద్యాలయం జట్టును అధిగమించింది.

పోటీలలో పాల్గొన్న మొత్తం 176 విశ్వవిద్యాలయాలలో 64 జట్లు బంగారు పతకాన్ని, 113 విశ్వవిద్యాలయాలు ఏదో ఒక పతకం సాధించడం విశేషం.

స్విమ్మింగ్ పోటీలలో ..పూణేకు చెందిన సాధ్వీ ధురీ, పంజాబ్ యూనివర్శిటీకి చెందిన సిద్ధాంత్ సెజ్వాల్ చెరో ఐదు బంగారు పతకాలు చొప్పున సాధించి…పోటీలకే అత్యుత్తమ అథ్లెట్లుగా నిలిచారు.

ముగింపు వేడుకల్లో కేంద్ర క్రీడామంత్రి కిరణ్ రిజ్జూ, ఒరిస్సా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్, భారత ఒలింపిక్స్ సంఘం అధ్యక్షుడు నరేంద్ర బాత్రా పాల్గొని విజేతలకు ట్రోఫీ అందచేశారు.

First Published:  2 March 2020 1:59 AM IST
Next Story