ఆనాడు వైఎస్... ఇవాళ జగన్... అదే హ్యుమన్ టచ్ !
పాదయాత్ర వైఎస్ రాజశేఖర్ రెడ్డిలో ఎన్నో మార్పులు తీసుకొచ్చింది. 2004లో అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన అమలు చేసింది పెన్షన్లు పెంచడం. అప్పటివరకూ ఇస్తున్న 70 రూపాయలను మూడింతలు చేశారు. 200 రూపాయలు ఇచ్చారు. అప్పటి ఆర్థిక పరిస్థితిని బట్టి మూడింతలు పెంచడం అప్పట్లో సాహసమే. పెంచడమే కాదు. పెన్షన్లను నెలానెలా తప్పనిసరిగా అందించారు. ఇప్పుడు జగన్ కూడా పాదయాత్రలో ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. ఫించన్ డబ్బులు నెలనెలా రావడం లేదని తెలుసుకున్నారు. డబ్బులు బ్యాంకుల్లో వేయడం […]
పాదయాత్ర వైఎస్ రాజశేఖర్ రెడ్డిలో ఎన్నో మార్పులు తీసుకొచ్చింది. 2004లో అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన అమలు చేసింది పెన్షన్లు పెంచడం. అప్పటివరకూ ఇస్తున్న 70 రూపాయలను మూడింతలు చేశారు. 200 రూపాయలు ఇచ్చారు. అప్పటి ఆర్థిక పరిస్థితిని బట్టి మూడింతలు పెంచడం అప్పట్లో సాహసమే. పెంచడమే కాదు. పెన్షన్లను నెలానెలా తప్పనిసరిగా అందించారు.
ఇప్పుడు జగన్ కూడా పాదయాత్రలో ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. ఫించన్ డబ్బులు నెలనెలా రావడం లేదని తెలుసుకున్నారు. డబ్బులు బ్యాంకుల్లో వేయడం ద్వారా అవి వృద్దులు తీసుకోలేకపోతున్నారని.. వారి ద్వారా సమస్యలు విన్నారు. పాదయాత్రలో విన్న సమస్యలను ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత పరిష్కారం చూపుతున్నారు. ఇంటింటికి ఫించన్ పంపిణీ చేపట్టారు. ప్రతి నెలా ఒకటో తేదీన ఫించన్ డబ్బులు అందజేస్తున్నారు.
ఇక ఇది ఆగే ప్రక్రియ కాదు. ఒకటో తేదీన ఠంచన్‌గా డబ్బులు వస్తున్నాయంటే అదో నమ్మకం. ఆ నమ్మకం కుదిరితే ప్రభుత్వంపై భరోసా పెరుగుతోంది. వృద్దులు ఏ సమస్యలు లేకుండా జీవిస్తారు. ఇదే జగన్ ఆశించే మార్పు.
మార్చి 1వ తేదీ.. ఆదివారం.. సెలవు రోజు అయినా వాలంటీర్లు లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లారు. ఒక్క రోజులోనే 87.61% పింఛన్ల పంపిణీ పూర్తి చేశారు. 51,53,215 మంది లబ్ధిదారులకు అక్షరాలా రూ.1,272.87 కోట్లు అందజేశారు. పశ్చిమ గోదావరి, వైఎస్సార్ జిల్లాల్లో తొలిరోజు 92 శాతానికి పైగా పింఛన్ల పంపిణీ పూర్తి కావటం ఇది ఓ రికార్డు.
మొత్తానికి మొదట స్పందన కార్యక్రమానికి ప్రాధాన్యం ఇచ్చారు. ఇప్పుడు ఫించన్ల పంపిణీ కార్యక్రమాన్ని లైన్‌లో పెట్టారు. ఇలా ఒక్కో కార్యక్రమం సక్రమంగా అమలు జరుగుతూ పోతే…జగన్ ప్రభుత్వాంపై భరోసా పెరుగుతోంది. అప్పుడు ప్రతిపక్షాలు ఎన్ని కుట్రలు…ఎంత విషప్రచారం చేసినా….జనం నమ్మే పరిస్థితి ఉండదు.