బిగ్ ఫైట్ కు ముహూర్తం ఖరారు... కత్తులు నూరుతున్న పార్టీలు
మరో బిగ్ పొలిటికల్ ఫైట్.. దగ్గరపడుతోంది. న్యాయ వివాదం కారణంగా స్థానిక సంస్థల ఎన్నికలు ఇప్పట్లో జరిగే సూచనలు లేకపోవడంతో.. పద్దుల లెక్కలు పూర్తి చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. స్థానిక రిజర్వేషన్ ల గొడవలు ఇప్పట్లో పరిష్కారం అయ్యేలా లేదని భావిస్తున్న వైఎస్ జగన్ ప్రభుత్వం.. మార్చి 6 నుంచి రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలని ఆలోచన చేస్తున్నట్టు అభిజ్ఞవర్గాల భోగట్టా. వచ్చే నెల 4న జరగనున్న రాష్ట్ర మంత్రి వర్గ సమావేశంలో ఈ […]
మరో బిగ్ పొలిటికల్ ఫైట్.. దగ్గరపడుతోంది. న్యాయ వివాదం కారణంగా స్థానిక సంస్థల ఎన్నికలు ఇప్పట్లో జరిగే సూచనలు లేకపోవడంతో.. పద్దుల లెక్కలు పూర్తి చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. స్థానిక రిజర్వేషన్ ల గొడవలు ఇప్పట్లో పరిష్కారం అయ్యేలా లేదని భావిస్తున్న వైఎస్ జగన్ ప్రభుత్వం.. మార్చి 6 నుంచి రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలని ఆలోచన చేస్తున్నట్టు అభిజ్ఞవర్గాల భోగట్టా.
వచ్చే నెల 4న జరగనున్న రాష్ట్ర మంత్రి వర్గ సమావేశంలో ఈ నిర్ణయాన్ని ఖరారు చేసే అవకాశం ఉంది. ఇదే జరిగితే.. 6న ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ప్రసంగిస్తారు.
ఆ తర్వాత 9న పద్దులను ఆర్థిక మంత్రి బుగ్గన.. వ్యవసాయ పద్దులను మంత్రి కన్నబాబు.. సభ ముందు ప్రవేశపెట్టే అవకాశాలు ఉన్నాయి. ఈ దిశగా జగన్ ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయం తీసుకున్నట్టు అనధికారికంగా తెలుస్తోంది.
ఇదే జరిగితే.. పద్దుల లెక్కలతో పాటు.. రాజకీయంగా వాడీ వేడిగా చర్చ జరిగే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. విశాఖ వివాదం.. రాజధాని వ్యవహారం.. మాటల తూటాలు పేలడం ఖాయమని అర్థమవుతోంది. ఇప్పటికే.. గతంలో జరిగిన శాసనసభ సమావేశాలు.. వైసీపీ వర్సెస్ టీడీపీ అన్నట్టుగా రసవత్తరంగా సాగాయి. విమర్శలు, ప్రతి విమర్శలతో రాజకీయ అసలు రుచిని జనానికి చూపించాయి.
ఇప్పుడున్న పరిస్థితులను బేరీజు వేస్తే.. గతం కంటే హాట్ హాట్ గా బడ్జెట్ సెషన్ జరగడం ఖాయంగా కనిపిస్తోంది.