Telugu Global
NEWS

ప్రపంచకప్ గ్రూప్-ఏ లీగ్ టాపర్ గా భారత్

శ్రీలంకపై అలవోకగా నెగ్గిన భారత్ ఆస్ట్ర్ల్రేలియా వేదికగా జరుగుతున్న 2020 మహిళా టీ-20 ప్రపంచకప్ గ్రూప్ – ఏ లీగ్ లో…4వ ర్యాంకర్, హాట్ ఫేవరెట్ భారత్ వరుస విజయాల పరంపర కొనసాగుతోంది. లీగ్ దశలో నాలుగుకు నాలుగురౌండ్ల మ్యాచ్ లు నెగ్గి గ్రూప్ టాపర్ గా సెమీస్ లో అడుగుపెట్టింది. మెల్బోర్న్ వేదికగా ముగిసిన నాలుగోరౌండ్ పోటీలో భారత్ 7 వికెట్లతో శ్రీలంకను మరో 32 బాల్స్ మిగిలిఉండగానే చిత్తు చేసింది. అంతగా ప్రాధాన్యం లేని […]

ప్రపంచకప్ గ్రూప్-ఏ లీగ్ టాపర్ గా భారత్
X
  • శ్రీలంకపై అలవోకగా నెగ్గిన భారత్

ఆస్ట్ర్ల్రేలియా వేదికగా జరుగుతున్న 2020 మహిళా టీ-20 ప్రపంచకప్ గ్రూప్ – ఏ లీగ్ లో…4వ ర్యాంకర్, హాట్ ఫేవరెట్ భారత్ వరుస విజయాల పరంపర కొనసాగుతోంది.

లీగ్ దశలో నాలుగుకు నాలుగురౌండ్ల మ్యాచ్ లు నెగ్గి గ్రూప్ టాపర్ గా సెమీస్ లో అడుగుపెట్టింది. మెల్బోర్న్ వేదికగా ముగిసిన నాలుగోరౌండ్ పోటీలో భారత్ 7 వికెట్లతో శ్రీలంకను మరో 32 బాల్స్ మిగిలిఉండగానే చిత్తు చేసింది. అంతగా ప్రాధాన్యం లేని ఈ ఆఖరి రౌండ్ పోటీలో టాస్ ఓడి ముందుగా ఫీల్డంగ్ కు దిగిన భారత్…ప్రత్యర్థి శ్రీలంకను 113 పరుగులకే కట్టడి చేయగలిగింది.

భారత లెఫ్టామ్ స్పిన్నర్ రాధా యాదవ్ 4 ఓవర్లలో 23 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టింది.

షఫాలీ మెరుపు బ్యాటింగ్….

సమాధానంగా 114 పరుగుల టార్గెట్ తో చేజింగ్ కు దిగిన భారత్ కు యువఓపెనర్ షఫాలీ మెరుపు బ్యాటింగ్ తో చెలరేగిపోయింది.కేవలం 34 బాల్స్ల్ లోనే 7 బౌండ్రీలు, ఓ సిక్సర్ తో 47 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచింది.

భారత్ 14.4 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికే గమ్యం చేరి 7 వికెట్లతో వరుసగా నాలుగో విజయంతో గ్రూప్- ఏ లీగ్ టాపర్ గా నిలిచింది. భారత విజయంలో ప్రధానపాత్ర వహించిన రాధా యాదవ్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.

గ్రూప్ -ఏ లీగ్ లో ప్రపంచ చాంపియన్ ఆస్ట్ర్ర్రేలియాను 18 పరుగులు, బంగ్లాదేశ్ ను 17 పరుగులు, న్యూజిలాండ్ ను 3 పరుగుల తేడాతో ఓడించిన భారత్.. ప్రస్తుత ప్రపంచకప్ లో చేజింగ్ కు దిగడం ద్వారా శ్రీలంకపై 7 వికెట్ల విజయం సాధించడం ఇదే మొదటిసారి.

First Published:  1 March 2020 2:39 AM IST
Next Story