తమిళ రాజకీయాల్లో కొత్త భయం !
తమిళనాడు రాజకీయాల్లో కొత్త భయం మొదలైంది. మాజీ ముఖ్యమంత్రులు కరుణానిధి, జయలలిత మృతి చెందిన తర్వాత అక్కడి రాజకీయాల్లో శూన్యత ఏర్పడింది. ఆ ఖాళీని ఎవరు భర్తీ చేస్తారో లేదో తెలియదు. కానీ ఇప్పుడు ఓభయం మాత్రం వారిని వెంటాడుతోంది. వచ్చే ఏడాది తమిళనాడులో ఎన్నికలు జరగబోతున్నాయి. ఓ వైపు ప్రతిపక్ష డీఎంకే ఎన్నికలకు సిద్ధమవుతోంది. ప్రశాంత్ కిషోర్ టీమ్‌తో కలిసి ముందుకు సాగుతోంది. ఇప్పటికే వ్యూహారచనలు మొదలు పెట్టింది. అయితే డీఎంకేకు చెందిన ఎమ్మెల్యేలు ఆకస్మాత్తుగా […]
తమిళనాడు రాజకీయాల్లో కొత్త భయం మొదలైంది. మాజీ ముఖ్యమంత్రులు కరుణానిధి, జయలలిత మృతి చెందిన తర్వాత అక్కడి రాజకీయాల్లో శూన్యత ఏర్పడింది. ఆ ఖాళీని ఎవరు భర్తీ చేస్తారో లేదో తెలియదు. కానీ ఇప్పుడు ఓభయం మాత్రం వారిని వెంటాడుతోంది.
వచ్చే ఏడాది తమిళనాడులో ఎన్నికలు జరగబోతున్నాయి. ఓ వైపు ప్రతిపక్ష డీఎంకే ఎన్నికలకు సిద్ధమవుతోంది. ప్రశాంత్ కిషోర్ టీమ్‌తో కలిసి ముందుకు సాగుతోంది. ఇప్పటికే వ్యూహారచనలు మొదలు పెట్టింది. అయితే డీఎంకేకు చెందిన ఎమ్మెల్యేలు ఆకస్మాత్తుగా చనిపోయారు. పన్నెండు గంటల వ్యవధిలో ఇద్దరు డీఎంకే ఎమ్మెల్యేలు అనారోగ్యంతో మృతి చెందారు.
డీఎంకే ఎమ్మెల్యే కేపీపీ స్వామి అనారోగ్యంతో గురువారం సాయంత్రం చనిపోయారు. ఆయన చనిపోయి 12గంటలు గడవలేదు. అప్పుడే శుక్రవారం ఉదయం మరో డీఎంకే ఎమ్మెల్యే కథావరయణ్ మృతి చెందారు. ఇద్దరు ఎమ్మెల్యేలు అనారోగ్యంతోనే చెన్నైలోని వేర్వేరు ఆసుపత్రుల్లో చనిపోయారు.
వేలూరు జిల్లా గుడియాట్టం నియోజకవర్గం నుంచి కథావరయణ్ ఎమ్మెల్యేగా గెలిచారు. తిరువట్టూర్ నుంచి కేపీపీ స్వామి ఎమ్మెల్యే అయ్యారు. 2016ఎన్నికల తర్వాత ఇప్పటి వరకూ జయలలిత, కరుణానిధి సహా ఆరుగురు అధికార, ప్రతిపక్ష ఎమ్మెల్యేలు చనిపోయారు. దీంతో ఎన్నికల నాటికి ఇంకా ఎలాంటి పరిస్థితులను చూడాల్సి వస్తుందోనని అక్కడి రాజకీయవర్గాలు భయపడుతున్నాయి.