Telugu Global
NEWS

ఇన్‌సైడ‌ర్ ట్రేడింగ్‌పై... స్పీడ్ పెంచిన సిట్

అమ‌రావ‌తిలో భూముల కొనుగోలు వ్య‌వ‌హారంపై సిట్ దూకుడు పెంచింది. ఇన్‌సైడ‌ర్ ట్రేడింగ్ విచార‌ణ చేప‌ట్టింది. ఆరోపణలు ఎదుర్కొంటున్న టీడీపీ నేతల బంధువుల ఇళ్లలో సిట్ బృందం సోదాలు నిర్వహించింది. విజ‌య‌వాడ‌లోని పడమటలో నివాసం ఉంటున్న మాజీమంత్రి పత్తిపాటి పుల్లారావు బంధువు ఇంట్లో సోదాలు నిర్వహించినట్టు సమాచారం. రాజధానిలో కొనుగోలు చేసిన భూముల పత్రాలు, వివరాలు సేకరించినట్టు తెలుస్తోంది. ఇన్‌సైడ‌ర్ ట్రేడింగ్ ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న టీడీపీ నేత‌లు ఇళ్ల‌లో త‌నిఖీల వ్య‌వ‌హారాన్ని సిట్ టీమ్ గోప్యంగా ఉంచుతోంది. ర‌హ‌స్యంగా […]

ఇన్‌సైడ‌ర్ ట్రేడింగ్‌పై... స్పీడ్ పెంచిన సిట్
X

అమ‌రావ‌తిలో భూముల కొనుగోలు వ్య‌వ‌హారంపై సిట్ దూకుడు పెంచింది. ఇన్‌సైడ‌ర్ ట్రేడింగ్ విచార‌ణ చేప‌ట్టింది.
ఆరోపణలు ఎదుర్కొంటున్న టీడీపీ నేతల బంధువుల ఇళ్లలో సిట్ బృందం సోదాలు నిర్వహించింది. విజ‌య‌వాడ‌లోని పడమటలో నివాసం ఉంటున్న మాజీమంత్రి పత్తిపాటి పుల్లారావు బంధువు ఇంట్లో సోదాలు నిర్వహించినట్టు సమాచారం. రాజధానిలో కొనుగోలు చేసిన భూముల పత్రాలు, వివరాలు సేకరించినట్టు తెలుస్తోంది.

ఇన్‌సైడ‌ర్ ట్రేడింగ్ ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న టీడీపీ నేత‌లు ఇళ్ల‌లో త‌నిఖీల వ్య‌వ‌హారాన్ని సిట్ టీమ్ గోప్యంగా ఉంచుతోంది. ర‌హ‌స్యంగా వెళ్లి విచార‌ణ జ‌రుపుతోంది. ఇప్ప‌టికే ప‌లువురి ఇళ్ల‌లో సోదాలు నిర్వ‌హించింది. కీల‌క ప‌త్రాలు స్వాధీనం చేసుకుంది. రాజ‌ధానిలో భూముల కొనుగోలుపై వారి ద‌గ్గ‌ర వివ‌రాలు సేక‌రిస్తోంది. పూర్తిస్థాయిలో విచారణ చేసిన త‌ర్వాతే వివరాలు వెల్లడించే అవకాశం ఉంది.

సిట్ దూకుడుతో అసైన్డ్ భూములు కొనుగోలుచేసి ఇన్సైడర్ ట్రేడింగ్ కి పాల్పడ్డ అక్రమార్కుల్లో ద‌డ మొద‌లైంది. దీంతో కొంద‌రు విజ‌య‌వాడ‌, గుంటూరును వ‌దిలి హైద‌రాబాద్‌లో మ‌కాం వేసిన‌ట్లు స‌మాచారం. సిట్ ఏర్పాటు చేసిన త‌ర్వాత వీరు అమ‌రావ‌తి ప‌రిస‌ర ప్రాంతాల‌కు కూడా వెళ్ల‌డం లేదట‌. అయితే వీరి క‌ద‌లిక‌ల‌పై క‌న్నేసిన సిట్‌…వారు ఎక్క‌డ ఉన్నా వెళ్లి వివ‌రాలు సేక‌రించేందుకు రెడీ అవుతోంద‌ట‌.

First Published:  29 Feb 2020 3:22 AM IST
Next Story