భారత క్రికెటర్లకు కపిల్ సలహా
ఐపీఎల్ కు దూరంగా ఉండమంటూ హితవు న్యూజిలాండ్ తో ముగిసిన వన్డే, టెస్ట్ సిరీస్ లోని తొలిమ్యాచ్ లో తమ ఓటమికి భారత కెప్టెన్ విరాట్ కొహ్లీ చెప్పిన సాకులను క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్ తప్పుపట్టాడు. విశ్రాంతి అనేది లేకుండా సిరీస్ వెంట సిరీస్ ఆడటమే తమ వైఫల్యానికి కారణమని…వెలింగ్టన్ టెస్ట్ పరాజయం తర్వాత భారత కెప్టెన్ విరాట్ కొహ్లీ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే…కపిల్ దేవ్ మాత్రం…క్రికెట్టే జీవితంగా చేసుకొన్న ఆటగాళ్లు సిరీస్ వెంట సిరీస్ […]
- ఐపీఎల్ కు దూరంగా ఉండమంటూ హితవు
న్యూజిలాండ్ తో ముగిసిన వన్డే, టెస్ట్ సిరీస్ లోని తొలిమ్యాచ్ లో తమ ఓటమికి భారత కెప్టెన్ విరాట్ కొహ్లీ చెప్పిన సాకులను క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్ తప్పుపట్టాడు.
విశ్రాంతి అనేది లేకుండా సిరీస్ వెంట సిరీస్ ఆడటమే తమ వైఫల్యానికి కారణమని…వెలింగ్టన్ టెస్ట్ పరాజయం తర్వాత భారత కెప్టెన్ విరాట్ కొహ్లీ ప్రకటించిన సంగతి తెలిసిందే.
అయితే…కపిల్ దేవ్ మాత్రం…క్రికెట్టే జీవితంగా చేసుకొన్న ఆటగాళ్లు సిరీస్ వెంట సిరీస్ ఆడుతూ రావాల్సిందేనని…ఒకవేళ మితిమీరిన క్రికెట్ ఆడుతున్నామన్న భావన కలిగితే…ఐపీఎల్ కు దూరంగా ఉండి తగిన విశ్రాంతి తీసుకోవాలని కపిల్ సలహా ఇచ్చాడు.
దేశం తరపున ఆడే సమయంలోనే క్రికెటర్లు మరింత అంకితభావం చూపాలని, భారతజట్టులో సభ్యులుగా ఆడటానికే ప్రాధాన్యం ఇవ్వాలని సూచించాడు.
ఐపీఎల్ ఫ్రాంచైజీలకు ఆటగాళ్లు ఇస్తున్న ప్రాధాన్యం… భారత జట్టు తరపున ఆడుతున్న సమయంలో కొందరు క్రికెటర్లు ఇవ్వటం లేదేమోనన్న సందేహాన్ని కపిల్ వ్యక్తం చేశాడు.
విజయాలు సాధిస్తున్నంత సేపూ అలసట అనేది ఉండదని… అదే పరాజయాలు, వైఫల్యాలు ఎదురవుతుంటే.. అలసిపోయామన్న భావన కలగటం సహజమని కపిల్ చెప్పాడు. క్రికెటర్ గా తాను ఇదే భావనకు గురయ్యానని, సక్సెస్ ఆటలో ఓ భాగం మాత్రమేనని, విజయాలు ఎప్పుడూ రావని గుర్తు చేశాడు.
ఆటగాళ్ళు భారతజెర్సీ ధరించి గ్రౌండ్ లోకి దిగితే అత్యుత్తమంగా రాణించడానికి కృషి చేయాలని సూచించాడు. న్యూజిలాండ్ తో కీలక ఆఖరి టెస్ట్ మ్యాచ్ ప్రారంభానికి కొద్దిగంటల ముందు కపిల్ దేవ్ తన అనుభవాన్ని మేళవించి… విరాట్ సేనకు సలహా ఇవ్వడం విశేషం.