Telugu Global
Cinema & Entertainment

‘హిట్’ సినిమా రివ్యూ

రివ్యూ : హిట్ రేటింగ్ : 3/5 తారాగణం : విశ్వక్ సేన్, రుహాని శర్మ, మురళి శర్మ తదితరులు సంగీతం : వివేక్ సాగర్ నిర్మాత :  ప్రశాంతి త్రిపురనేని దర్శకత్వం : శైలేష్ కొలను ‘ఫలక్ నుమా దాస్’ సినిమాతో హీరోగా పరిచయమైన యువ హీరో విశ్వక్ సేన్ తాజాగా ఇప్పుడు ‘హిట్: ది ఫస్ట్ కేస్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. క్రైమ్ థ్రిల్లర్ గా విడుదలైన ఈ సినిమాకి శైలేష్ కొలను దర్శకత్వం వహించాడు. […]

‘హిట్’ సినిమా రివ్యూ
X

రివ్యూ : హిట్
రేటింగ్ : 3/5
తారాగణం : విశ్వక్ సేన్, రుహాని శర్మ, మురళి శర్మ తదితరులు
సంగీతం : వివేక్ సాగర్
నిర్మాత : ప్రశాంతి త్రిపురనేని
దర్శకత్వం : శైలేష్ కొలను

‘ఫలక్ నుమా దాస్’ సినిమాతో హీరోగా పరిచయమైన యువ హీరో విశ్వక్ సేన్ తాజాగా ఇప్పుడు ‘హిట్: ది ఫస్ట్ కేస్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. క్రైమ్ థ్రిల్లర్ గా విడుదలైన ఈ సినిమాకి శైలేష్ కొలను దర్శకత్వం వహించాడు. ‘చి ల సౌ’ సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయిన రుహాని శర్మ ఈ సినిమాలో హీరోయిన్ గా నటించింది. మురళి శర్మ ముఖ్య పాత్ర పోషించిన ఈ సినిమాని వాల్ పోస్టర్ సినిమా పతాకంపై ప్రశాంతి నిర్మించారు. టీజర్ మరియు ట్రైలర్ తోనే ఆకట్టుకున్న ఈ సినిమా నాచురల్ స్టార్ నాని సమర్పణలో… ఈరోజు విడుదలైంది.

కథ:

విక్రమ్ రుద్రరాజు (విశ్వక్ సేన్) తెలంగాణలో పోలీస్ ఆఫీసర్ గా పని చేస్తూ ఉంటాడు. అయితే గతంలో జరిగిన కొన్ని దురదృష్టపు సంఘటనల వలన అతను మెంటల్ గా డిస్టర్బ్ అవుతాడు. డాక్టర్ అతనిని కొన్ని రోజుల పాటు రెస్ట్ తీసుకోమని చెబుతారు. కానీ అప్పుడే ప్రీతి అనే ఒక అమ్మాయి మిస్సింగ్ కేస్ వస్తుంది. తన ప్రాణాలను పణంగా పెట్టయినా విక్రమ్ ఈ కేస్ సాల్వ్ చేయాలి అనుకుంటాడు. ఎవరు ఈ ప్రీతి? ఆమె కి ఏమైంది? తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

నటీనటులు:

‘ఫలక్ నుమా దాస్’ సినిమాతో పోలిస్తే విశ్వక్ సేన్ కు ఈ సినిమాలో ఒక విభిన్నమైన పాత్ర దక్కింది. అయితే పర్ఫామెన్స్ కి బాగా స్కోప్ ఉన్న పాత్ర కావడంతో… విశ్వక్ సేన్ ఈ సినిమాలో తన నటనతో అందరి దృష్టిని బాగా ఆకర్షించారు. యాక్షన్ సన్నివేశాల్లో మాత్రమే కాక ఎమోషనల్ సన్నివేశాల్లో కూడా విశ్వక్ సేన్ తన పాత్రకి పూర్తి స్థాయిలో న్యాయం చేశాడు.

‘చి ల సౌ’ సినిమాలో పక్కింటమ్మాయి తరహా పాత్రలో కనిపించిన రుహాని శర్మ ఈ సినిమాలో ఒక విభిన్నమైన పాత్రలతో ప్రేక్షకుల ముందుకి వచ్చింది. కేవలం తన అందంతో మాత్రమే కాకుండా… పర్ఫార్మెన్స్ తో కూడా రుహాని శర్మ అందరి దృష్టిని ఆకట్టుకుంటోంది. ఎప్పటిలాగానే మురళీ శర్మ ఈ సినిమాలో కూడా చాలా బాగా నటించాడు. ఇకపోతే రోహిత్ పాత్రలో నటించిన నటుడు సినిమా మొత్తం హీరో పాత్రతో ట్రావెల్ అయ్యి తన నటనతో మెప్పించాడు. మిగతా నటీనటులు కూడా తమ పాత్రల పరిధి మేరకు బాగానే నటించారు.

సాంకేతిక వర్గం:

దర్శకుడు శైలేష్ కొలను ఈ సినిమా కోసం ఒక ఆసక్తికరమైన కథను ఎంపిక చేసుకున్నాడు. మిగతా క్రైమ్ థ్రిల్లర్ సినిమాలతో పోలిస్తే ఈ సినిమాలో శైలేష్ కథను చాలా ఆసక్తికరంగా మలిచాడు. అప్పుడప్పుడు వచ్చే ట్విస్ట్ లు కూడా ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అవుతాయి, బోరు కొట్టకుండా చేస్తాయి. కథని ఎక్కడ స్లో అవ్వకుండా శైలేష్ కొలను చాలా బాగా నెరేట్ చేశాడు. ప్రశాంతి అందించిన నిర్మాణ విలువలు ఈ సినిమాకి చాలా బాగా ప్లస్ అయ్యాయి. వివేక్ సాగర్ సంగీతం కూడా చాలా బాగుంది. ముఖ్యంగా వివేక్ అందించిన నేపధ్య సంగీతం కూడా ప్రతి సన్నివేశాన్ని ఎలివేట్ చేసింది. ఎస్ మణికందన్ అందించిన విజువల్స్ సినిమాకి పెద్ద ప్లస్ పాయింట్ గా చెప్పచ్చు. గ్యారీ ఎడిటింగ్ పర్వాలేదు అనిపిస్తుంది.

బలాలు:

డైరెక్షన్, నటీనటులు, ట్విస్ట్ లు

బలహీనతలు:

సెకండ్ హాఫ్ లో కొన్ని సన్నివేశాలు

బాటమ్ లైన్:

‘హిట్’ హిట్ అవ్వగలిగే కథ ఉన్న సినిమా

First Published:  28 Feb 2020 3:55 AM GMT
Next Story