గంటా వారి లీలలు.. ఎటు వైపో అడుగులు?
గంటా శ్రీనివాసరావు. ఉత్తరాంధ్ర రాజకీయాల్లో ఈయన ఓ సంచలనం. ప్రతిసారి ఎన్నికల్లో స్థాన చలనం.. ఈయనకు ఓ అలవాటు. కానీ.. విజయం మాత్రం తనకే దక్కేలా రాజకీయ వ్యూహం పన్నడంలో ఆయన ఆరి తేరిన వ్యక్తి. అంతటి నాయకుడు.. తన సొంత పార్టీ అధినేత తన జిల్లాకే వస్తే.. కనీసం మాట వరసకైనా మాట్లాడలేదు. పలకరింపునకూ వెళ్లలేదు. ఏం పాపం.. అని ఆరా తీసిన నేతలకు ఓ పొంతన లేని సమాధానం వచ్చింది. తన తండ్రికి సంబంధించిన […]
గంటా శ్రీనివాసరావు. ఉత్తరాంధ్ర రాజకీయాల్లో ఈయన ఓ సంచలనం. ప్రతిసారి ఎన్నికల్లో స్థాన చలనం.. ఈయనకు ఓ అలవాటు. కానీ.. విజయం మాత్రం తనకే దక్కేలా రాజకీయ వ్యూహం పన్నడంలో ఆయన ఆరి తేరిన వ్యక్తి. అంతటి నాయకుడు.. తన సొంత పార్టీ అధినేత తన జిల్లాకే వస్తే.. కనీసం మాట వరసకైనా మాట్లాడలేదు. పలకరింపునకూ వెళ్లలేదు. ఏం పాపం.. అని ఆరా తీసిన నేతలకు ఓ పొంతన లేని సమాధానం వచ్చింది.
తన తండ్రికి సంబంధించిన కార్యక్రమాలు ఉన్న కారణంగానే.. చంద్రబాబు పర్యటనకు వ్యక్తిగతంగా హాజరు కాలేకపోయినట్టు ఆయన ఓ లీకును ఇచ్చి తర్వాత కామ్ గా ఉన్నారు. తన్నుకు చావండి.. నేను మాత్రం వచ్చేది లేదు అన్నట్టుగా ఆయన మిన్నకుండిపోయారు. ఇప్పటికే ఆయనపై జంపింగ్ జపాంగ్ అని ఓ ముద్ర ఉంది.
అధికారంలో ఏ పార్టీ ఉంటే.. ఆ పార్టీకి అనుకూలంగా నడుచుకోవడం.. మంత్రి పదవి కోసం గతంలో పార్టీ మారిన అనుభవం ఉండడం.. పదవి, అధికారం లేకుంటే ఆయన రాజకీయం చేయలేడన్న అభిప్రాయం కూడా సర్వత్రా ఉండడం ఇక్కడ గమనించాల్సిన అంశమని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. త్వరలోనే.. కుదిరితే కాషాయం కండువా.. లేదంటే “నియోజకవర్గ అభివృద్ధి” కోసం వైసీపీ కండువా వేసుకుంటారన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.
ఇందులో నిజమెంతో తెలియదు కానీ.. చంద్రబాబును గంటా తీవ్రంగా అవమానించారని మాత్రం టీడీపీ నేతలు రగిలిపోతున్నారట. విశాఖ వేదికగా చేసిన విఫల యత్నానికి.. ఆ జిల్లాకు చెందిన నేతే లేకపోతే ఎలా అని వ్యాఖ్యానిస్తున్నారట. రగిలీ రగిలీ.. ఇది గంటా వారు పార్టీకి చివరి గంట కొట్టే వరకూ వెళ్లేలాగే వ్యవహారం ఉందన్న టాక్.. టీడీపీలో కాస్త బలంగానే వినిపిస్తోంది.