Telugu Global
NEWS

దిశ నిందితుల కుటుంబాల పిటిషన్ తిరస్కరించిన సుప్రీంకోర్టు

హైదరాబాద్ శివార్లలో దారుణ అత్యాచారం, హత్యకు గురైన వెటర్నరీ డాక్టర్ దిశ హత్య కేసు నిందితుల కుటుంబాలు దాఖలు చేసిన పిటిషన్‌పై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. దిశ నిందితులను అన్యాయంగా ఎన్‌కౌంటర్‌లో చంపేశారని.. ఆ ఎన్‌కౌంటర్‌లో పాల్గొన్న పోలీసులపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని వారు పిటిషన్‌లో కోరారు. అంతే కాకుండా ప్రతీ కుటుంబానికి 50 లక్షల రూపాయలు నష్టపరిహారంగా ఇవ్వాలని కూడా పేర్కొన్నారు. కాగా, ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించలేమని ప్రధాన న్యాయమూర్తి జస్టీస్ బాబ్డే […]

దిశ నిందితుల కుటుంబాల పిటిషన్ తిరస్కరించిన సుప్రీంకోర్టు
X

హైదరాబాద్ శివార్లలో దారుణ అత్యాచారం, హత్యకు గురైన వెటర్నరీ డాక్టర్ దిశ హత్య కేసు నిందితుల కుటుంబాలు దాఖలు చేసిన పిటిషన్‌పై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ జరిగింది.

దిశ నిందితులను అన్యాయంగా ఎన్‌కౌంటర్‌లో చంపేశారని.. ఆ ఎన్‌కౌంటర్‌లో పాల్గొన్న పోలీసులపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని వారు పిటిషన్‌లో కోరారు. అంతే కాకుండా ప్రతీ కుటుంబానికి 50 లక్షల రూపాయలు నష్టపరిహారంగా ఇవ్వాలని కూడా పేర్కొన్నారు.

కాగా, ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించలేమని ప్రధాన న్యాయమూర్తి జస్టీస్ బాబ్డే స్పష్టం చేశారు. ఇప్పటికే దిశ హత్య, నిందితులు ఎన్‌కౌంటర్‌పై సుప్రీంకోర్టు న్యాయ విచారణ కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయాన్ని గుర్తు చేశారు.

అయితే నిందితుల కుటుంబాలు న్యాయ విచారణ కమిషన్‌ను కలిసే స్వతంత్రత ఇస్తున్నట్లు సీజేఐ స్పష్టం చేశారు. ఏమైనా చెప్పాలనుకుంటే కమిషన్‌కు తెలపాలని జస్టీస్ బాబ్డే సూచించారు.

అయితే, ఈ విషయంలో న్యాయం జరగలేదని భావిస్తే మళ్లీ సుప్రీంకోర్టును ఆశ్రయించే అవకాశం కల్పిస్తున్నట్లు ప్రధాన న్యాయమూర్తి తెలిపారు. సీజేఐ సూచన మేరకు పిటిషన్ ఉపసంహరించుకుంటున్నట్లు నిందితుల కుటుంబాల తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు.

First Published:  28 Feb 2020 11:12 AM IST
Next Story