Telugu Global
CRIME

ఆ దారుణ హత్యను చూసి... పోస్టు మార్టంలో డాక్టర్లకు షాక్!

ఇంతటి దారుణ హత్యను మా కెరీర్ లో ఎన్నడూ చూడలేదు. మాకే షాక్ గా ఉంది.. అంటూ ఢిల్లీ డాక్టర్లు భీతిల్లిపోయారు. పోస్టు మార్టం చేయాల్సిన వారే.. ఆ హత్య తీరు చూసి హడలిపోయారు. ఇంటెలిజెన్స్ బ్యూరో యువ అధికారి అంకిత్ శర్మ హత్య జరిగిన తీరును చూసి ఆ డాక్టర్లు చలించిపోయారు. వారు ఇచ్చిన శవ పంచనామా నివేదిక వివరాలు తెలుసుకున్న వారు కూడా.. ఎంత ఘోరం జరిగింది.. అని ఆవేదన చెందుతున్నారు. ఒకటి కాదు.. […]

ఆ దారుణ హత్యను చూసి... పోస్టు మార్టంలో డాక్టర్లకు షాక్!
X

ఇంతటి దారుణ హత్యను మా కెరీర్ లో ఎన్నడూ చూడలేదు. మాకే షాక్ గా ఉంది.. అంటూ ఢిల్లీ డాక్టర్లు భీతిల్లిపోయారు. పోస్టు మార్టం చేయాల్సిన వారే.. ఆ హత్య తీరు చూసి హడలిపోయారు. ఇంటెలిజెన్స్ బ్యూరో యువ అధికారి అంకిత్ శర్మ హత్య జరిగిన తీరును చూసి ఆ డాక్టర్లు చలించిపోయారు. వారు ఇచ్చిన శవ పంచనామా నివేదిక వివరాలు తెలుసుకున్న వారు కూడా.. ఎంత ఘోరం జరిగింది.. అని ఆవేదన చెందుతున్నారు.

ఒకటి కాదు.. పదులు కాదు.. ఏకంగా నాలుగు వందల కత్తిపోట్లు.. శరీరంలోని ఏ అవయవాన్ని కూడా వదల్లేదు. ఆరు గంటల పాటు చిత్ర హింసలకు గురి చేసి.. నరకయాతన పెట్టి.. అతి కిరాతకంగా.. అత్యంత దారుణంగా.. పాశవికంగా ఆ హత్య జరిగింది. పగవాడికి కూడా ఇంతటి భయంకరమైన దుస్థితి రావద్దు అని అనుకునే ఈ సందర్భం.. అంకిత్ కుటుంబానికి తీరని వేదనను మిగిల్చింది.

ఎవరు చంపారో తెలియదు? ఎందుకు చంపారో తెలియదు? ఇంత దారుణంగా ఎందుకు పగబట్టారో తెలియదు? కానీ.. పక్కా ప్రణాళికతో అంకిత్ ను దుండగులు చంపారు. హత్యను కూడా ఆస్వాదించుకుంటూ పని కానిచ్చారు అంటే.. వారు ఎంత కరుడుగట్టిన నేరస్తులన్నదీ అర్థమవుతోంది. ఈ వ్యవహారంలో.. ఢిల్లీ ఆమ్ ఆద్మీ పార్టీ మాజీ నాయకుడు తాహీర్ హుస్సేన్ పై కేసు నమోదైంది.

మరి.. తాహిర్ కు అంకిత్ శర్మకు మధ్య ఏం గొడవలున్నాయ్? ఇంతటి దారుణానికి ఎందుకు పరిస్థితులు దారి తీశాయి? అన్నది.. పోలీసుల విచారణలో తేలాల్సి ఉంది.

First Published:  28 Feb 2020 9:08 AM IST
Next Story