తెలంగాణ కేబినెట్ లోకి కొత్తవాళ్లకు చోటు... నిజమేనా?
తెలంగాణ మంత్రివర్గ విస్తరణపై మళ్లీ పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ప్రభుత్వ వర్గాల నుంచి.. టీఆర్ఎస్ వర్గాల నుంచి ఈ దిశగా ఎలాంటి వార్తలు వినిపించకపోయినా.. కొన్ని వెబ్ సైట్లలో వస్తున్న కథనాల ప్రకారం.. ఈ ఊహాగానాలు మళ్లీ జోరందుకుంటున్నాయి. గతంలోనూ ఓ సారి కేరళకు చెందిన ఓ ఐపీఎస్ ను రాజీనామా చేయించి మరీ తెలంగాణ మంత్రి వర్గంలోకి తీసుకుంటారన్న ప్రచారం జరిగింది కానీ.. ఇప్పటివరకూ ఉలుకూ లేదు పలుకూ లేదు. తాజాగా.. మళ్లీ ముఖ్యమంత్రి కేసీఆర్ […]
తెలంగాణ మంత్రివర్గ విస్తరణపై మళ్లీ పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ప్రభుత్వ వర్గాల నుంచి.. టీఆర్ఎస్ వర్గాల నుంచి ఈ దిశగా ఎలాంటి వార్తలు వినిపించకపోయినా.. కొన్ని వెబ్ సైట్లలో వస్తున్న కథనాల ప్రకారం.. ఈ ఊహాగానాలు మళ్లీ జోరందుకుంటున్నాయి. గతంలోనూ ఓ సారి కేరళకు చెందిన ఓ ఐపీఎస్ ను రాజీనామా చేయించి మరీ తెలంగాణ మంత్రి వర్గంలోకి తీసుకుంటారన్న ప్రచారం జరిగింది కానీ.. ఇప్పటివరకూ ఉలుకూ లేదు పలుకూ లేదు.
తాజాగా.. మళ్లీ ముఖ్యమంత్రి కేసీఆర్ కేబినెట్ విస్తరణపై ఆలోచన చేస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. అది కూడా.. టీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి, తన తనయుడు కేటీఆర్ కు అనుకూలంగా ఉండే నలుగురు కొత్తవారిని మంత్రి వర్గంలోకి తీసుకుంటారన్న ముచ్చట.. జోరుగా నడుస్తోంది. త్వరలో కేటీఆర్ కు తెలంగాణ ప్రభుత్వ పగ్గాలు అందించే దిశగానే ఈ చర్య అన్న వివరణ.. ఆ ముచ్చటకు తోడవుతోంది.
ఇదే నిజమైతే.. ఆ నలుగురు ఎవరన్నది ఎవరికీ అంతుబట్టకుండా ఉంది. నలుగురికి చోటు నిజమే అయితే.. ఉన్నవారిలో నలుగురిని ఖాళీ చేయించాల్సిందే. మరి.. పోస్టులు ఊడిపోయే ఆ నలుగురు ఎవరన్నది కూడా అర్థం కాని ప్రశ్నగా మిగిలింది. ప్రస్తుత మంత్రివర్గంలో మెజారిటీ భాగం.. కేటీఆర్ వర్గంగానే ఉంది. హరీష్ రావు, ఈటల రాజేందర్ వంటి వారు మినహా.. అంతా కేటీఆర్ కే జై కొడుతున్నారు.
ఎర్రబెల్లి దయాకర్ రావు, శ్రీనివాస్ గౌడ్ తోపాటు.. మరి కొందరు.. ఏకంగా కేటీఆర్ ముఖ్యమంత్రి అవుతారని కూడా చెప్పేస్తున్నారు. ఇంతలో.. కేబినెట్ విస్తరణ వార్త మళ్లీ పుట్టుకొచ్చింది. ఇందులో ఎంతవరకు నిజముంది.. అన్నది.. ప్రస్తుతానికైతే సమాధానం లేని ప్రశ్నగానే మిగులుతోంది.