Telugu Global
NEWS

ధోనీ ప్రాక్టీసుకు ముహూర్తం కుదిరింది

మార్చి 2 నుంచి బ్యాట్ పట్టనున్న మహీ క్రికెట్ కు గత కొద్దిమాసాలుగా దూరంగా ఉన్న భారత మాజీ కెప్టెన్, ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ సారథి మహేంద్ర సింగ్ ధోనీ రీ-ఎంట్రీకి రంగం సిద్ధమయ్యింది. మార్చి 29 నుంచి ప్రారంభం కానున్న ఐపీఎల్ 13వ సీజన్ కు..38 ఏళ్ల ధోనీ సిద్దంకావాలని నిర్ణయించాడు. చెన్నైఫ్రాంచైజీ హోంగ్రౌండ్ చెపాక్ స్టేడియం వేదికగా మార్చి 2 నుంచి ప్రాక్టీసు మొదలు పెట్టాలని నిర్ణయించాడు. ఇంగ్లండ్ వేదికగా గత […]

ధోనీ ప్రాక్టీసుకు ముహూర్తం కుదిరింది
X
  • మార్చి 2 నుంచి బ్యాట్ పట్టనున్న మహీ

క్రికెట్ కు గత కొద్దిమాసాలుగా దూరంగా ఉన్న భారత మాజీ కెప్టెన్, ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ సారథి మహేంద్ర సింగ్ ధోనీ రీ-ఎంట్రీకి రంగం సిద్ధమయ్యింది.

మార్చి 29 నుంచి ప్రారంభం కానున్న ఐపీఎల్ 13వ సీజన్ కు..38 ఏళ్ల ధోనీ సిద్దంకావాలని నిర్ణయించాడు. చెన్నైఫ్రాంచైజీ హోంగ్రౌండ్ చెపాక్ స్టేడియం వేదికగా మార్చి 2 నుంచి ప్రాక్టీసు మొదలు పెట్టాలని నిర్ణయించాడు. ఇంగ్లండ్ వేదికగా గత ఏడాదిముగిసిన వన్డే ప్రపంచకప్ సెమీఫైనల్లో న్యూజిలాండ్ చేతిలో భారతజట్టు ఓటమి తర్వాత నుంచి…తనకు తానుగా సెమీ రిటైర్మెంట్ తీసుకొని…క్రికెట్ కు దూరంగా ఉన్న…ధోనీ పునరాగమనం పై.. గతకొద్ది మాసాలుగా ఊహాగానాలు జోరుగా సాగుతున్నాయి.

ధోనీ రిటైర్మెంట్ ఎప్పుడని విమర్శకులు ఎదురుచూస్తుంటే…భారత టీమ్ మేనేజ్ మెంట్ తో పాటు అభిమానులు సైతం రీ-ఎంట్రీ కోసం కొండంత ఆశతో ఎదురుచూస్తున్నారు.

ధోనీకి వారసుడిగా యువవికెట్ కీపర్ బ్యాట్స్ మన్ ను గత కొద్దిమ్యాచ్ లుగా ప్రమోట్ చేసి ప్రోత్సహించినా ఫలితం లేకపోడంతో…స్పెషలిస్ట్ బ్యాట్స్ మన్ కెఎల్ రాహుల్ తో టీమ్ మేనేజ్ మెంట్ నెట్టుకొంటూ వస్తోంది.

మరోవైపు ధోనీ ..ఐపీఎల్ లో తన సత్తా చాటుకొంటే…2020 టీ-20 ప్రపంచకప్ కు అవకాశమిస్తామని టీమ్ మేనేజ్ మెంట్ చెప్పకనే చెబుతోంది.

చెన్నై టీమ్ పూర్తిస్థాయి శిక్షణ శిబిరం మార్చి 19 నుంచి ప్రారంభంకానున్నా…కెప్టెన్ ధోనీ మాత్రం మార్చి 2 నుంచే సాధన చేస్తాడని …చెన్నై ప్రాంచైజీ సీఇవో ప్రకటించారు.

మార్చి 29న ముంబై వాంఖెడీ స్టేడియం వేదికగా డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్ తో జరిగే ప్రారంభమ్యాచ్ ద్వారా ధోనీ…పునరాగమనం చేయనున్నాడు.

సురేశ్ రైనా, అంబటి రాయుడులతో కలసి ధోనీ మూడువారాలపాటు సాధన చేస్తాడని టీమ్ వర్గాలు తెలిపాయి. మూడుసార్లు ఐపీఎల్ విజేత చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో పియూష్ చావ్లా, జోష్ హేజిల్ వుడ్, సామ్ కరెన్ లాంటి మొనగాళ్లున్నారు.

First Published:  26 Feb 2020 2:36 AM IST
Next Story