Telugu Global
NEWS

అమెరికా అధ్యక్షుని నోట సచిన్, కొహ్లీల మాట!

లక్షా 25వేల మందితో వారేవ్వా! మోతేరా ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియం. అంతేకాదు…ప్రపంచానికే పెద్దన్న అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్..ఓ అరుదైన ఘట్టం ద్వారా ప్రపంచ దృష్టినే ఆకర్షించారు. భారత్ లో రెండురోజుల పర్యటన కోసం తన మందిమార్బలంతో తరలి వచ్చిన అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కు భారత ప్రధాని నరేంద్ర మోడీ.. కళ్లు చెదిరే స్థాయిలో రెడ్ కార్పెట్ పరచి మరీ స్వాగతం పలికారు. ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియంగా పేరుపొందిన అహ్మదాబాద్ లోని మోతేరా స్టేడియంలో […]

అమెరికా అధ్యక్షుని నోట సచిన్, కొహ్లీల మాట!
X
  • లక్షా 25వేల మందితో వారేవ్వా! మోతేరా

ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియం. అంతేకాదు…ప్రపంచానికే పెద్దన్న అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్..ఓ అరుదైన ఘట్టం ద్వారా ప్రపంచ దృష్టినే ఆకర్షించారు.

భారత్ లో రెండురోజుల పర్యటన కోసం తన మందిమార్బలంతో తరలి వచ్చిన అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కు భారత ప్రధాని నరేంద్ర మోడీ.. కళ్లు చెదిరే స్థాయిలో రెడ్ కార్పెట్ పరచి మరీ స్వాగతం పలికారు.

ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియంగా పేరుపొందిన అహ్మదాబాద్ లోని మోతేరా స్టేడియంలో ..లక్షా 25వేల మంది సమక్షంలో ట్రంప్ పరివారం కోసం.. నమస్తే ట్రంప్ కార్యక్రమాన్ని నిర్వహించారు.

ట్రంప్ స్తుతి…మోడీ జపం..!

భారత్ తో ద్వైపాక్షిక సంబంధాలు, భారత్ పైన ప్రేమకంటే…అమెరికాలోని 40 లక్షలమంది భారత సంతతి ఓటర్ల పైన ప్రేమతో మాత్రమే భారత్ కు తరలి వచ్చిన అమెరికా అధ్యక్షుడు…ఒకేసారి లక్షా 25వేల మందిని చూసి ఫిదా అయిపోయారు. తన స్వాగతం కోసం భారత ప్రభుత్వం, ప్రధానంగా నరేంద్ర మోడీ చేసిన ఏర్పాట్లు చూసి పొంగిపోయారు.

మోతేరా స్టేడియంలోని జనసంద్రాన్ని చూసి మురిసిపోయారు. భారత్ పైన, భారత ప్రధానిపైన పొగడ్తల వర్షం కురిపించారు. భారత్ బాలీవుడ్ సినిమాలకు మాత్రమే కాదు..సచిన్ టెండుల్కర్, విరాట్ కొహ్లీ లాంటి గొప్ప క్రికెటర్లకు చిరునామా అంటూ ఆకాశానికి ఎత్తేశారు.

సచిన్ ను సూచిన్ తండుల్కర్, విరాట్ ను విరూట్ కూహ్లీ అంటు ఉచ్చరించడాన్ని ఐసీసీ తప్పు పట్టింది. ప్రముఖుల పేర్లను ఏ విధంగా పలకాలో అమెరికా అధ్యక్షుడికి తెలియదా అంటూ ఆటపట్టించింది.

అమెరికా అధ్యక్షుడి 3 గంటల అహ్మదాబాద్ పర్యటన కోసం గుజరాత్ ప్రభుత్వం 100 కోట్ల రూపాయలు, కేంద్రప్రభుత్వం 14 కోట్ల రూపాయలు, వెరసి…ట్రంప్ దొరగారి కోసం 114 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని మంచినీళ్ల ప్రాయంలా ఖర్చు చేసి…తమ గొప్పమనసును అటు గుజరాత్ ముఖ్యమంత్రి, ఇటు భారత ప్రధాని చాటుకోగలిగారు.

First Published:  25 Feb 2020 3:03 AM IST
Next Story