ఏడు కొండలపైకి మెట్రో రైల్... సాధ్యమయ్యే పనేనా?
తిరుమల కొండపైకి నిత్యం వేలాదిగా.. ఒక్కోసారి లక్షల్లో భక్తులు వెళ్లి వస్తుంటారు. వారిని కొండపైకి చేర్చి.. తిరిగి తిరుపతికి తీసుకురావడంలో బస్సులు, ప్రైవేటు వాహనాలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. కానీ.. కొండ మార్గం విస్తృతికి అవకాశం లేకపోవడం.. లోయ దారిలో బస్సుల సంఖ్య భారీగా పెంచే అవకాశం లేకపోవడం.. ప్రైవేటు వాహనాలకు భారీగా అనుమతించే అవకాశం లేకపోవడం ఫలితంగా.. ఒక్కోసారి భక్తుల రాకపోకలకు ఇబ్బంది ఎదురవుతోంది. ఖచ్చితంగా.. భవిష్యత్తులో ఈ విషయం సమస్యాత్మకంగా మారడమే కాదు.. భక్తులకు […]
తిరుమల కొండపైకి నిత్యం వేలాదిగా.. ఒక్కోసారి లక్షల్లో భక్తులు వెళ్లి వస్తుంటారు. వారిని కొండపైకి చేర్చి.. తిరిగి తిరుపతికి తీసుకురావడంలో బస్సులు, ప్రైవేటు వాహనాలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. కానీ.. కొండ మార్గం విస్తృతికి అవకాశం లేకపోవడం.. లోయ దారిలో బస్సుల సంఖ్య భారీగా పెంచే అవకాశం లేకపోవడం.. ప్రైవేటు వాహనాలకు భారీగా అనుమతించే అవకాశం లేకపోవడం ఫలితంగా.. ఒక్కోసారి భక్తుల రాకపోకలకు ఇబ్బంది ఎదురవుతోంది.
ఖచ్చితంగా.. భవిష్యత్తులో ఈ విషయం సమస్యాత్మకంగా మారడమే కాదు.. భక్తులకు ఇబ్బందిని కలిగించేదిగానూ మారుతుందన్న అభిప్రాయం ఉంది. అందుకే.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తోంది. మెట్రో రైలు మార్గాన్ని కానీ.. మోనో రైలు మార్గాన్ని కానీ అందుబాటులోకి తెస్తే ఎలా ఉంటుందన్నది పరిశీలిస్తోంది. ఈ విషయమై ఇటీవల తిరుపతికి వచ్చిన హైదరాబాద్ మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డితో టీటీడీ ఛైర్మన్ సుబ్బారెడ్డి మాట్లాడారు.
కొండపైకి మెట్రోకు ఉన్న అవకాశాలపై ఆరా తీశారు. యూరప్ లోని ఆస్ట్రియాలో ఇలానే కొండలపైకి మోనో రైలు వేశారని.. తిరుమలలోనూ ఇది సాధ్యమే అని ఎన్వీఎస్ రెడ్డి.. సుబ్బారెడ్డికి చెప్పారు. ఇది సాధ్యమైతే కొండపై శబ్ద, వాయు కాలుష్యం కూడా కాస్త తగ్గుతుందని ఇరువురూ అభిప్రాయపడ్డారు. కానీ.. రిజర్వ్ ఫారెస్టు కావడంతో.. అనుమతుల విషయంలో సమస్యలు వచ్చే అవకాశం ఉందని అంటున్నారు.
అలాగే.. గతంలోనూ తిరుమల కొండపైకి ప్రత్యామ్నాయ మార్గాల పరిశీలన చర్చ జరిగింది. అప్పుడు కొన్ని అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ఇప్పుడు.. మరోసారి కొండపైకి రైలు మార్గాన్ని పరిశీలిస్తున్న ప్రభుత్వానికి ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయన్నది చూడాల్సి ఉంది.