Telugu Global
NEWS

ప్రపంచకప్ సెమీస్ లో భారత్

బంగ్లాదేశ్ పై 18 పరుగుల విజయం టీ-20 మహిళా ప్రపంచకప్ సెమీస్ కు 4వ ర్యాంకర్ భారత్ చేరువయ్యింది. ఐదుజట్ల గ్రూప్-ఏ రౌండ్ రాబిన్ లీగ్ లో వరుసగా రెండో విజయంతో నాకౌట్ రౌండ్ కు చేరింది. పెర్త్ లోని వాకా స్టేడియం వేదికగా ముగిసిన రెండోరౌండ్ మ్యాచ్ లో బంగ్లాదేశ్ ను 18 పరుగుల తేడాతో భారత్ అధిగమించింది. ప్రారంభమ్యాచ్ లో ప్రపంచ చాంపియన్ ఆస్ట్ర్రేలియాపై సంచలన విజయం సాధించిన భారత్ కు గ్రూప్-ఏ లీగ్ లో ఇది […]

ప్రపంచకప్ సెమీస్ లో భారత్
X
  • బంగ్లాదేశ్ పై 18 పరుగుల విజయం

టీ-20 మహిళా ప్రపంచకప్ సెమీస్ కు 4వ ర్యాంకర్ భారత్ చేరువయ్యింది. ఐదుజట్ల గ్రూప్-ఏ రౌండ్ రాబిన్ లీగ్ లో వరుసగా రెండో విజయంతో నాకౌట్ రౌండ్ కు చేరింది.

పెర్త్ లోని వాకా స్టేడియం వేదికగా ముగిసిన రెండోరౌండ్ మ్యాచ్ లో బంగ్లాదేశ్ ను 18 పరుగుల తేడాతో భారత్ అధిగమించింది. ప్రారంభమ్యాచ్ లో ప్రపంచ చాంపియన్ ఆస్ట్ర్రేలియాపై సంచలన విజయం సాధించిన భారత్ కు గ్రూప్-ఏ లీగ్ లో ఇది వరుసగా రెండోగెలుపు.

షఫాలీ మెరుపు బ్యాటింగ్…

ఈ కీలకమ్యాచ్ లో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ కు దిగిన భారత్ కు యువఓపెనర్ షఫాలీ వర్మ కేవలం 17 బాల్స్ లో 2 బౌండ్రీలు, 4 సిక్సర్లతో అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చింది. వన్ డౌన్ జెమీమా రోడ్రిగేస్ సైతం 37 బాల్స్ లో 34 పరుగులు, మిడిలార్డర్ లో వేద కృష్ణమూర్తి 20 పరుగులు సాధించడంతో… భారత్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 142 పరుగులు చేయగలిగింది.

పూనమ్ స్పిన్ మ్యాజిక్…

143 పరుగుల విజయలక్ష్యంతో చేజింగ్ కు దిగిన బంగ్లాదేశ్ ఓపెనర్ ముర్షిదా, రెండోడౌన్ నిగర్ సుల్తానా చక్కటి భాగస్వామ్యంతో విజయానికి పునాది వేసినా…భారత పేసర్ల జోడీ శిఖా పాండే, అరుంధతిరెడ్డి, లెగ్ స్పిన్నర్ పూనమ్ యాదవ్ ల ముప్పేట దాడితో ప్రత్యర్థిజట్టు…8 వికెట్లకు 124 పరుగులు మాత్రమే చేయగలిగింది.

పూనమ్ యాదవ్ 4 ఓవర్లలో 18 పరుగులిచ్చి 3వికెట్లు సాధించింది. భారత విజయంలో ప్రధానపాత్ర వహించిన 16 ఏళ్ల ఓపెనర్ షఫాలీ వర్మకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. గ్రూప్ మిగిలిన రెండుమ్యాచ్ ల్లోనూ…. శ్రీలంక, న్యూజిలాండ్ జట్లతో భారత్ తలపడాల్సి ఉంది.

First Published:  24 Feb 2020 8:01 PM GMT
Next Story