విరాట్ కొహ్లీకి సెంచరీల కరువు
గత 20 ఇన్నింగ్స్ లో మూడంకెల స్కోరులేని భారత కెప్టెన్ ప్రపంచ క్రికెట్ నంబర్ వన్ బ్యాట్స్ మన్, భారత పరుగుల యంత్రం విరాట్ కొహ్లీ తన కెరియర్ లో మూడోసారి గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నాడు. అలవోకగా శతకాలు బాదే కొహ్లీకి భారీస్కోర్లు మాత్రమే కాదు…మూడంకెల స్కోర్లు సైతం కరువయ్యాయి. ప్రస్తుత న్యూజిలాండ్ టెస్ట్ సిరీస్ కు ముందు వరకూ 85 టెస్టులు, 248 వన్డేలు, 82 టీ-20 మ్యాచ్ లు ఆడిన కొహ్లీకి…70 శతకాలు బాదిన రికార్డు ఉంది. […]
- గత 20 ఇన్నింగ్స్ లో మూడంకెల స్కోరులేని భారత కెప్టెన్
ప్రపంచ క్రికెట్ నంబర్ వన్ బ్యాట్స్ మన్, భారత పరుగుల యంత్రం విరాట్ కొహ్లీ తన కెరియర్ లో మూడోసారి గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నాడు.
అలవోకగా శతకాలు బాదే కొహ్లీకి భారీస్కోర్లు మాత్రమే కాదు…మూడంకెల స్కోర్లు సైతం కరువయ్యాయి. ప్రస్తుత న్యూజిలాండ్ టెస్ట్ సిరీస్ కు ముందు వరకూ 85 టెస్టులు, 248 వన్డేలు, 82 టీ-20 మ్యాచ్ లు ఆడిన కొహ్లీకి…70 శతకాలు బాదిన రికార్డు ఉంది.
తన కెరియర్ లో ఇప్పటి వరకూ ప్రతిఐదు ఇన్నింగ్స్ కు ఓ సెంచరీ బాదుతూ వచ్చిన విరాట్ కొహ్లీ…చివరిసారిగా కోల్ కతా ఈడెన్ గార్డెన్స్ వేదికగా బంగ్లాదేశ్ తో గత ఏడాది ముగిసిన డే-నైట్ టెస్ట్ మ్యాచ్ లో 136 పరుగులతో శతకం బాదాడు.
20 ఇన్నింగ్స్ గా సెంచరీలేమి…
ఆ తర్వాత నుంచి ప్రస్తుత వెలింగ్టన్ టెస్టు వరకూ క్రికెట్ మూడు ఫార్మాట్లలో కలసి 20 ఇన్నింగ్స్ ఆడిన కొహ్లీ ఒక్క శతకమూ సాధించలేకపోయాడు.
2019 డిసెంబర్ 12 నుంచి 2020 ఫిబ్రవరి 23 వరకూ 20 ఇన్నింగ్స్ ఆడిన విరాట్ కొహ్లీ మూడంకెల స్కోరు సాధించడంలో విఫలమయ్యాడు.
వెలింగ్టన్ టెస్ట్ తొలి ఇన్నింగ్స్ లో 2 పరుగులు, రెండో ఇన్నింగ్స్ లో 19 పరుగుల స్కోరు మాత్రమే సాధించిన కొహ్లీ కెరియర్ లో సెంచరీలు సాధించకపోడం ఇదే మొదటిసారికాదు.
2014 ఫిబ్రవరి 28 నుంచి 2014 అక్టోబర్ 11 మధ్యకాలంలో 25 ఇన్నింగ్స్ పాటు విరాట్…శతకం కోసం ఎదురుచూడాల్సి వచ్చింది. అంతేకాదు…2011 ఫిబ్రవరి 27 నుంచి 2011 సెప్టెంబర్ 11 మధ్యకాలంలో 24 ఇన్నింగ్స్ పాటు కొహ్లీ సెంచరీ లేకుండా గడిపాడు.
క్రైస్ట్ చర్చి వేదికగా ఫిబ్రవరి 29 నుంచి న్యూజిలాండ్ తో జరిగే కీలక రెండోటెస్టులోనైనా విరాట్ కొహ్లీ…సెంచరీ కళ్లజూస్తాడో లేదో వేచిచూడాల్సిందే.