Telugu Global
National

ట్రంప్ నోట... హైదరాబాద్ !

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. భారత్ కు వచ్చారు. వేలాది కిలోమీటర్ల ప్రయాణం చేసినా కూడా.. భారత్ లో అడుగు పెట్టినప్పటి నుంచి.. ఉత్సాహంగా కనిపించారు. ప్రధాని మోదీతో ప్రాణ స్నేహితుడిగా కదిలారు. ముందుగా అహ్మదాబాద్ లో దిగిన తర్వాత.. సబర్మతి ఆశ్రమానికి వెళ్లారు. మహాత్మాగాంధీ జీవిత విశేషాలను తెలుసుకున్నారు. చరఖాతో నూలు వడికే విధానాన్ని తెలుసుకుని ట్రంప్ దంపతులు ముచ్చటపడ్డారు. అక్కడి నుంచి నేరుగా మొటేరా క్రికెట్ స్టేడియంలో ‘నమస్తే ట్రంప్’ బహిరంగ సభకు ప్రధాని […]

ట్రంప్ నోట... హైదరాబాద్ !
X

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. భారత్ కు వచ్చారు. వేలాది కిలోమీటర్ల ప్రయాణం చేసినా కూడా.. భారత్ లో అడుగు పెట్టినప్పటి నుంచి.. ఉత్సాహంగా కనిపించారు. ప్రధాని మోదీతో ప్రాణ స్నేహితుడిగా కదిలారు. ముందుగా అహ్మదాబాద్ లో దిగిన తర్వాత.. సబర్మతి ఆశ్రమానికి వెళ్లారు. మహాత్మాగాంధీ జీవిత విశేషాలను తెలుసుకున్నారు. చరఖాతో నూలు వడికే విధానాన్ని తెలుసుకుని ట్రంప్ దంపతులు ముచ్చటపడ్డారు.

అక్కడి నుంచి నేరుగా మొటేరా క్రికెట్ స్టేడియంలో ‘నమస్తే ట్రంప్’ బహిరంగ సభకు ప్రధాని మోదీతో కలిసి హాజరయ్యారు. సబర్మతి ఆశ్రమం నుంచి స్టేడియం వరకూ దారి పొడవునా లక్షలాదిగా ప్రజలు చేతులు ఊపుతూ ట్రంప్ కు స్వాగతం చెప్పారు. అలా.. మొటేరా మైదానంలో సభకు హాజరయ్యారు. లక్షలాదిగా హాజరైన అశేష ప్రజానీకాన్ని ఉద్దేశించి మాట్లాడారు. ఈ ఆతిథ్యానికి, అభిమానానికి పులకించినట్టు చెప్పారు.

భారత్ తో సంబంధాలు బలోపేతమని.. ఇండియా అమెరికాకు నిజమైన స్నేహితుడని కొనియాడారు. పనిలో పనిగా.. ఉభయ తెలుగు రాష్ట్రాల రాజధాని హైదరాబాద్ ప్రస్తావన తెచ్చారు. గతంలో.. తన కూతురు ఇవాంకా ట్రంప్ హైదరాబాద్ లో అంతర్జాతీయ పారిశ్రామికవేత్తల సదస్సుకు హాజరైనప్పుడు చూపించిన అభిమానాన్ని గుర్తు చేసుకున్నారు. తమ దేశస్తులతో భారత్ కు ఉన్న సంబంధాలు ఎంతటి ఉన్నతమైనవో చెప్పే క్రమంలో హైదరాబాద్ ను ప్రస్తావించారు.

మన దేశంలో పర్యటించే రెండు రోజుల్లో.. ట్రంప్ తెలుగు రాష్ట్రాలకు రాకున్నా.. కనీసం హైదరాబాద్ ప్రస్తావన అయినా తెచ్చారు సంతోషం.. అని తెలుగు రాష్ట్రాల ప్రజలు మాట్లాడుకుంటున్నారు.

First Published:  24 Feb 2020 12:28 PM IST
Next Story