Telugu Global
National

3వేల టన్నుల బంగారం ఉందన్నది అవాస్తవం : జీఎస్ఐ

ఉత్తరప్రదేశ్‌లోని సోన్‌భద్ర ప్రాంతంలో భారీ బంగారపు నిల్వలు ఉన్నాయని మీడియాలో వార్తలు వచ్చాయి. ఇప్పడు మొత్తం ఇండియాలో లభ్యమయ్యే నిల్వల కంటే అక్కడ 5 రెట్లు ఎక్కువ బంగారం దొరుకుతుందంటూ మీడియా విస్తృతంగా కథనాలు రాసింది. అయితే ఆ కథనాలన్నీ అవాస్తవాలని జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా స్పష్టం చేసింది. ఈ మేరకు శనివారం ఒక ప్రకటన విడుదల చేసింది. సోన్‌భద్ర ప్రాంతంలో బంగారం నిల్వల కోసం గత కొంత కాలంగా అన్వేషణ జరుపుతున్నాము. కాని అక్కడ […]

3వేల టన్నుల బంగారం ఉందన్నది అవాస్తవం : జీఎస్ఐ
X

ఉత్తరప్రదేశ్‌లోని సోన్‌భద్ర ప్రాంతంలో భారీ బంగారపు నిల్వలు ఉన్నాయని మీడియాలో వార్తలు వచ్చాయి. ఇప్పడు మొత్తం ఇండియాలో లభ్యమయ్యే నిల్వల కంటే అక్కడ 5 రెట్లు ఎక్కువ బంగారం దొరుకుతుందంటూ మీడియా విస్తృతంగా కథనాలు రాసింది. అయితే ఆ కథనాలన్నీ అవాస్తవాలని జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా స్పష్టం చేసింది. ఈ మేరకు శనివారం ఒక ప్రకటన విడుదల చేసింది.

సోన్‌భద్ర ప్రాంతంలో బంగారం నిల్వల కోసం గత కొంత కాలంగా అన్వేషణ జరుపుతున్నాము. కాని అక్కడ అన్నీ ప్రతికూల ఫలితాలే వచ్చాయని జీఎస్ఐ స్పష్టం చేసింది. మీడియాలో వచ్చిన కథనాలన్నీ అవాస్తవమే. అక్కడ బంగారు నిల్వలు లేవు.. అక్కడ ఎన్నో రకాల ఖనిజాలు దొరుకుతాయి. కాబట్టి ఒక టన్ను ఖనిజం నుంచి 3.03 గ్రాముల బంగారం మాత్రమే వెలువడుతుందని జీఎస్ఐ తెలిపింది.

అక్కడ ఉన్న మొత్తం 52,806.25 టన్నుల ముడి ఖనిజం వెలువడితే 160 కిలోల బంగారం మాత్రమే వస్తుందని తెలిపింది. అంతే కాని మీడియాలో వార్తలు వచ్చినట్లు 3,350 టన్నుల బంగారం కాదని జీఎస్ఐ డైరెక్టర్ ఎం. శ్రీధర్ మీడియాకు తెలిపారు.

First Published:  23 Feb 2020 3:10 AM IST
Next Story