Telugu Global
NEWS

తొలిటెస్టుపై న్యూజిలాండ్ పట్టు

భారత్ పై 183 పరుగుల ఆధిక్యం టెస్ట్ క్రికెట్ టాప్ ర్యాంకర్ భారత్ తో వెలింగ్టన్ వేదికగా జరుగుతున్న తొలిటెస్టులో ఆతిథ్య న్యూజిలాండ్ 183 పరుగుల కీలక తొలిఇన్నింగ్స్ ఆధిక్యంతో మ్యాచ్ పై పట్టు సాధించింది. రెండోరోజుఆట ముగిసే సమయానికి సాధించిన స్కోరుతో ..మూడోరోజు ఆట కొనసాగించిన కీవీజట్టుకు ఆల్ రౌండర్లు గ్రాండ్ హోమీ- జామీసన్ కీలక భాగస్వామ్యంతో.. భారీ తొలి ఇన్నింగ్స్ ఆధిక్యత సాధించడంలో ప్రధానపాత్ర వహించారు. గ్రాండ్ హోమీ 44, జామీసన్ 43 పరుగుల స్కోర్లు సాధించారు. […]

తొలిటెస్టుపై న్యూజిలాండ్ పట్టు
X
  • భారత్ పై 183 పరుగుల ఆధిక్యం

టెస్ట్ క్రికెట్ టాప్ ర్యాంకర్ భారత్ తో వెలింగ్టన్ వేదికగా జరుగుతున్న తొలిటెస్టులో ఆతిథ్య న్యూజిలాండ్ 183 పరుగుల కీలక తొలిఇన్నింగ్స్ ఆధిక్యంతో మ్యాచ్ పై పట్టు సాధించింది.

రెండోరోజుఆట ముగిసే సమయానికి సాధించిన స్కోరుతో ..మూడోరోజు ఆట కొనసాగించిన కీవీజట్టుకు ఆల్ రౌండర్లు గ్రాండ్ హోమీ- జామీసన్ కీలక భాగస్వామ్యంతో.. భారీ తొలి ఇన్నింగ్స్ ఆధిక్యత సాధించడంలో ప్రధానపాత్ర వహించారు.

గ్రాండ్ హోమీ 44, జామీసన్ 43 పరుగుల స్కోర్లు సాధించారు. టెయిల్ ఎండర్ ట్రెంట్ బౌల్ట్ 24 బాల్స్ లో 5 బౌండ్రీలు, ఓ సిక్సర్ తో 38 పరుగుల మెరుపు ఇన్నింగ్స్ తో.. అదిరిపోయే ముగింపు ఇచ్చాడు.

చివరకు…న్యూజిలాండ్ 100.2 ఓవర్లలో 348 పరుగుల స్కోరుకు ఆలౌటయ్యింది. భారత బౌలర్లలో ఇశాంత్ శర్మ 5 వికెట్లు, అశ్విన్ 3 వికెట్లు బుమ్రా, షమీ చెరో వికెట్ పడగొట్టారు.

భారత లంబూ ఫాస్ట్ బౌలర్ ఇశాంత్ శర్మకు టెస్టు క్రికెట్లో 5 వికెట్లు సాధించడం ఇది 11వసారి కావడం విశేషం.

తొలిఇన్నింగ్స్ లో భారత్ ను 165 పరుగులకే కుప్పకూల్చిన కివీజట్టు…బ్యాటింగ్ లో స్థాయికి తగ్గట్టుగా రాణించడం ద్వారా 183 పరుగుల కీలక తొలిఇన్నింగ్స్ తో పైచేయి సాధించగలిగింది.

గత ఏడాది కాలంలో ప్రత్యర్థికి భారీ తొలిఇన్నింగ్స్ ఆధిక్యాన్ని సమర్పించుకోడం భారత్ కు ఇదే మొదటిసారి. ఐసీసీ టెస్ట్ లీగ్ లో భారత్ ఇప్పటి వరకూ ఆడిన ఏడు టెస్టులు, మూడు సిరీస్ ల్లోనూ తిరుగులేని విజయాలు సాధించడం ద్వారా…360 పాయింట్లతో లీగ్ టేబుల్ టాపర్ గా నిలిచింది.

First Published:  23 Feb 2020 5:11 AM IST
Next Story