Telugu Global
NEWS

టీ కాంగ్రెస్ కుర్చీ కోసం పోటీలో ఆ నలుగురు... గెలిచేదెవరు?

తెలంగాణలో కాంగ్రెస్ కు అధ్యక్షుడిని మార్చే దిశగా అడుగులు పడుతున్నాయి. రోజు రోజుకూ పార్టీ బలహీన పడుతున్న ప్రస్తుత తరుణంలో.. అధికారం, పదవి లేక పక్క పార్టీల వైపు నేతలు చూస్తున్న ప్రమాదకర పరిస్థితుల్లో…. తెలంగాణలో పార్టీని బతికించుకునేందుకు కాంగ్రెస్ అధిష్టానం కసరత్తు చేస్తున్నట్టుగా సమాచారం అందుతోంది. క్లిష్ట పరిస్థితుల్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి పార్టీని ముందుకు తీసుకువెళ్లే ప్రయత్నం చేసినా.. టీఆర్ఎస్ హవాలో ఆ ప్రయత్నాలు అంతగా ఫలితాన్ని ఇవ్వలేదు. పైగా.. పార్టీలో సీనియర్ నాయకుల […]

టీ కాంగ్రెస్ కుర్చీ కోసం పోటీలో ఆ నలుగురు... గెలిచేదెవరు?
X

తెలంగాణలో కాంగ్రెస్ కు అధ్యక్షుడిని మార్చే దిశగా అడుగులు పడుతున్నాయి. రోజు రోజుకూ పార్టీ బలహీన పడుతున్న ప్రస్తుత తరుణంలో.. అధికారం, పదవి లేక పక్క పార్టీల వైపు నేతలు చూస్తున్న ప్రమాదకర పరిస్థితుల్లో…. తెలంగాణలో పార్టీని బతికించుకునేందుకు కాంగ్రెస్ అధిష్టానం కసరత్తు చేస్తున్నట్టుగా సమాచారం అందుతోంది.

క్లిష్ట పరిస్థితుల్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి పార్టీని ముందుకు తీసుకువెళ్లే ప్రయత్నం చేసినా.. టీఆర్ఎస్ హవాలో ఆ ప్రయత్నాలు అంతగా ఫలితాన్ని ఇవ్వలేదు. పైగా.. పార్టీలో సీనియర్ నాయకుల సిగపట్లు.. బయటికి కనిపించని ఆధిపత్య పోరు.. కాంగ్రెస్ ను తెలంగాణలో నానాటికీ బలహీనం చేస్తూ వచ్చాయి. ఇప్పుడు పీసీసీ చీఫ్ ను మార్చే సమయం వచ్చింది.

చాలా రోజుల క్రితమే తాను పదవి నుంచి తప్పుకొంటానని.. తన సొంత నియోజకవర్గానికి మాత్రమే పరిమితం అవుతానని ఉత్తమ్ చెప్పారు. అయినా.. అప్పుడు పార్టీ అధ్యక్షుడిని మార్చని అధిష్టానం.. తాజాగా కసరత్తు ప్రారంభించింది. ఆశావహుల వివరాలు, అర్హతలు తెలుసుకోవడంతో పాటు.. అర్హులు ఎవరన్నదానిపై వడపోత చేస్తున్నట్టు పార్టీ ఢిల్లీ వర్గాలంటున్నాయి.

రేసులో సీనియర్ నాయకుడు మర్రి శశిధర్ రెడ్డి, పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, మాజీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పేర్లు బలంగా వినిపిస్తుండగా.. ఇతర సీనియర్లు జీవన్ రెడ్డి, చిన్నారెడ్డి, షబ్బీర్ అలీ, వీహెచ్ వంటి నేతల పేర్లు కూడా తరువాతి వరసలో ఊహాగానాల్లో నిలుస్తున్నాయి.

వీరిలో ఎవరిని పీసీసీ పీఠం వరించనుంది? ఊహాగానాల్లో ఉన్న నేతలకే అవకాశం దక్కుతుందా.. లేక అనూహ్యంగా మరెవరైనా తెరపైకి వస్తారా… అన్నది పార్టీ వర్గాల్లో ఉత్కంఠ పెంచుతోంది.

First Published:  22 Feb 2020 8:58 AM IST
Next Story