Telugu Global
NEWS

ఆన్ లైన్ లోనే అనుమతులు... తగ్గనున్న అక్రమాలు

ఇంటర్మీడియట్ విద్యా విధానంలో మార్పులకు.. ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఇంటర్మీడియట్ బోర్డు.. ఈ దిశగా కీలక ప్రతిపాదనలను ప్రభుత్వం ముందు పెట్టింది. లక్షలకు లక్షలు ఫీజులు వసూలు చేస్తున్న తీరును కూడా అరికట్టేందుకు ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. ఇప్పటికీ వీటిని ఇంటర్మీడియట్ బోర్డు ప్రభుత్వానికి పంపగా.. ఆమోదం వచ్చిన తర్వాత అమల్లోకి తీసుకువచ్చేందుకు అధికారులు యోచిస్తున్నారు. ఇన్నాళ్లూ కళాశాలల యాజమాన్యాలు ఆఫ్ లైన్ లో దరఖాస్తులు చేసేవి. ప్రమాణాలు, నిబంధనల ప్రకారం తమ కళాశాలలో అన్నీ ఉన్నట్టు చెప్పేవి. […]

ఆన్ లైన్ లోనే అనుమతులు... తగ్గనున్న అక్రమాలు
X

ఇంటర్మీడియట్ విద్యా విధానంలో మార్పులకు.. ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఇంటర్మీడియట్ బోర్డు.. ఈ దిశగా కీలక ప్రతిపాదనలను ప్రభుత్వం ముందు పెట్టింది. లక్షలకు లక్షలు ఫీజులు వసూలు చేస్తున్న తీరును కూడా అరికట్టేందుకు ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. ఇప్పటికీ వీటిని ఇంటర్మీడియట్ బోర్డు ప్రభుత్వానికి పంపగా.. ఆమోదం వచ్చిన తర్వాత అమల్లోకి తీసుకువచ్చేందుకు అధికారులు యోచిస్తున్నారు.

ఇన్నాళ్లూ కళాశాలల యాజమాన్యాలు ఆఫ్ లైన్ లో దరఖాస్తులు చేసేవి. ప్రమాణాలు, నిబంధనల ప్రకారం తమ కళాశాలలో అన్నీ ఉన్నట్టు చెప్పేవి. వసతుల విషయంలో కొన్ని యాజమాన్యాలు అవాస్తవాలు చెప్పి అనుమతులు తీసుకున్న ఉదంతాలూ గతంలో వెలుగు చూశాయి. ఇలాంటివాటిని నివారించే దిశగా అధికారులు ప్రతిపాదనలు రూపొందించారు. ఆన్ లైన్ లో దరఖాస్తు చేస్తేనే.. అనుమతి ఇవ్వాలని ప్రతిపాదిచారు.

ఆన్ లైన్ విధానంలో వచ్చిన దరఖాస్తుల్లో.. కళాశాల భవనంతో పాటు వసతులు, ప్రయోగ శాలలు, తరగతి గదులు, మైదానం… తదితరాలన్నీ కచ్చితమైన స్థలాల వివరాలు చెబుతూ ఫొటోలు కూడా సమర్పించాల్సి ఉంటుంది. తర్వాత వీటిని ఉన్నతాధికారులు జియో ట్యాగ్ చేస్తారు. అన్నీ కరెక్ట్ గా ఉన్నాయని అనుకుంటేనే అనుమతులు ఇస్తారు. ఫలితంగా.. ఒకచోట అనుమతి తీసుకుని.. మరోచోట కళాశాల నిర్వహణ లాంటి అవినీతికి చెక్ పడుతుంది.

ఫీజుల విషయంలోనూ ఆన్ లైన్ విధానాన్ని అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. కార్పొరేట్ కళాశాలలతో పాటు.. ఇతర కాలేజీల్లోనూ ఫీజుల దందాకు చెక్ పెట్టాలంటే.. ఇదే కరెక్ట్ అని భావిస్తోంది. అన్నీ కుదిరితే.. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఈ నిర్ణయాలు అమల్లోకి వచ్చే అవకాశాలు ఉన్నట్టు అధికారులు అంచనా వేస్తున్నారు.

First Published:  22 Feb 2020 8:07 AM IST
Next Story