Telugu Global
CRIME

మిస్సింగ్ మిస్ట‌రీ.... బీటెక్ స్టూడెంట్ ఎక్క‌డ‌?

కొద్దిరోజుల క్రితం తెలంగాణ రాష్ట్రంలో అదృశ్య‌మైన బీటెక్ స్టూడెంట్ మిస్ట‌రీ ఇంకా కొన‌సాగుతోంది. ప‌న్నెండు రోజుల క్రితం హాస్ట‌ల్ నుంచి అదృశ్యమైన స్టూడెంట్ జీవ‌న్ రెడ్డి ఆచూకీ కోసం పోలీసులు రంగంలోకి దిగారు. నల్గొండ జిల్లాకు చెందిన జీవ‌న్ రెడ్డి మేడ్చ‌ల్ జిల్లాలోని మ‌ల్లారెడ్డి ఇంజ‌నీరింగ్ కాలేజీలో బీటెక్ థ‌ర్డ్ ఇయ‌ర్ చ‌దువుతున్నాడు. కొద్ది రోజుల క్రితం హాస్ట‌ల్ లో త‌న స్నేహితుల‌తొ గొడ‌వ‌ప‌డ్డాడు. అప్ప‌టి నుంచి అత‌గాడు క‌నిపించ‌కుండా పోయాడు. దీంతో హస్ట‌ల్ వాచ్ మెన్ […]

మిస్సింగ్ మిస్ట‌రీ.... బీటెక్ స్టూడెంట్ ఎక్క‌డ‌?
X

కొద్దిరోజుల క్రితం తెలంగాణ రాష్ట్రంలో అదృశ్య‌మైన బీటెక్ స్టూడెంట్ మిస్ట‌రీ ఇంకా కొన‌సాగుతోంది. ప‌న్నెండు రోజుల క్రితం హాస్ట‌ల్ నుంచి అదృశ్యమైన స్టూడెంట్ జీవ‌న్ రెడ్డి ఆచూకీ కోసం పోలీసులు రంగంలోకి దిగారు.

నల్గొండ జిల్లాకు చెందిన జీవ‌న్ రెడ్డి మేడ్చ‌ల్ జిల్లాలోని మ‌ల్లారెడ్డి ఇంజ‌నీరింగ్ కాలేజీలో బీటెక్ థ‌ర్డ్ ఇయ‌ర్ చ‌దువుతున్నాడు. కొద్ది రోజుల క్రితం హాస్ట‌ల్ లో త‌న స్నేహితుల‌తొ గొడ‌వ‌ప‌డ్డాడు. అప్ప‌టి నుంచి అత‌గాడు క‌నిపించ‌కుండా పోయాడు. దీంతో హస్ట‌ల్ వాచ్ మెన్ నాగారం పోలీసుల‌కు ఫిర్యాదు చేసాడు. రంగంలోకి దిగిన పోలీసులు…విచార‌ణ ప్రారంభించారు. మొద‌ట వాచ్ మెన్ ఇచ్చిన ఫిర్యాదుపైనే విచార‌ణ మొద‌లు పెట్టారు…పోలీసులు. అత‌డు చెప్పిన ఆధారాలతో హాస్ట‌ల్ లోని జీవన్ రెడ్డి గ‌దిలో అత‌ని బ‌ట్ట‌ల‌పై ర‌క్త‌పు మ‌ర‌క‌లు ఉండటాన్ని గుర్తించిన పోలీసులు దానిపైనే లోతుగా విచార‌ణ చేప‌ట్టారు.

తోటి విద్యార్దుల‌తో ఘ‌ర్ష‌ణ ప‌డి ఉంటాడేమోన‌న్న కోణంలోనూ ద‌ర్యాప్తు ప్రారంభించారు. దీనికి తోడు జీవన్ రెడ్డి అదృశ్యంపై వాచ్ మెన్ పాత్రపైన అనుమానాలు వ్య‌క్త‌మ‌వుతున్న‌ట్టు స‌మాచారం. అయితే జీవ‌న్ రెడ్డి అదృశ్య‌ఘ‌ట‌న పై కాలేజీ యాజమాన్యం నుంచి ఏ ర‌క‌మైన ఫిర్యాదు అంద‌క పోవ‌డంపై కూడా పోలీసులలో ప‌లు అనుమానాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఏదైనా మంత్రి మ‌ల్లారెడ్డి కాలేజీలో బీటెక్ స్టూడెంట్ మిస్సింగ్ మిస్ట‌రీ పోలీసుల‌కు ఓ స‌వాల్ గా మారింది.

First Published:  22 Feb 2020 9:00 AM IST
Next Story