Telugu Global
NEWS

ఏపీ రైతులకు ప్రభుత్వం శుభవార్త.... ఇక ఈ-కర్షక్ తప్పనిసరి కాదు!

ఆంధ్రప్రదేశ్ రైతులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఆరుగాలం కష్టించి పండించిన పంటను ప్రభుత్వం కొనుగోలు చేసే విధానంలో కీలక మార్పులు చేసినట్టు వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు ప్రకటించారు. ఇకపై.. రైతులు తమ పంటలను ప్రభుత్వం ఏర్పాటు చేసన కొనుగోలు కేంద్రాల్లో విక్రయించేందుకు.. ఈ-కర్షక్ యాప్ లో నమోదు చేసుకోవాల్సిన అవసరం తప్పని సరి కాదని మంత్రి చెప్పారు. కందులు, శనగల విక్రయానికి గతంలో ఈ-కర్షక్ లో నమోదై ఉంటేనే అవకాశం కలిగేదని గుర్తు […]

ఏపీ రైతులకు ప్రభుత్వం శుభవార్త.... ఇక ఈ-కర్షక్ తప్పనిసరి కాదు!
X

ఆంధ్రప్రదేశ్ రైతులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఆరుగాలం కష్టించి పండించిన పంటను ప్రభుత్వం కొనుగోలు చేసే విధానంలో కీలక మార్పులు చేసినట్టు వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు ప్రకటించారు. ఇకపై.. రైతులు తమ పంటలను ప్రభుత్వం ఏర్పాటు చేసన కొనుగోలు కేంద్రాల్లో విక్రయించేందుకు.. ఈ-కర్షక్ యాప్ లో నమోదు చేసుకోవాల్సిన అవసరం తప్పని సరి కాదని మంత్రి చెప్పారు.

కందులు, శనగల విక్రయానికి గతంలో ఈ-కర్షక్ లో నమోదై ఉంటేనే అవకాశం కలిగేదని గుర్తు చేసిన మంత్రి.. ఇప్పుడు ఆ అవసరం లేకుండానే ఆఫ్ లైన్ విధానంలో కొనుగోలు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు. అయితే.. పంటకు సంబంధించి.. రైతులు వ్యవసాయ అధికారుల నుంచి తగిన లెటర్ ను తీసుకురావాల్సి ఉంటుందని అన్నారు. ప్రక్రియ పారదర్శకంగా నిర్వహించేందుకే ఈ నిర్ణయమని అధికారులు చెప్పారు.

ఇక.. రాష్ట్రంలో ఇప్పటికే మార్క్ ఫెడ్ ద్వారా 98 కందుల కొనుగోలు కేంద్రాలు.. మరో వంద శనగల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటయ్యాయి. వీటన్నిటిలో.. మంత్రి ప్రకటించిన మేరకు ఈ-కర్షక్ విధానంలో నమోదు చేసుకోని రైతులకు సైతం తమ పంటను విక్రయించుకునే అవకాశం కలగనుంది. అలాగే.. ఇప్పటివరకు ఆయా కొనుగోలు కేంద్రాల నుంచి లక్షా 95 వేల క్వింటాళ్ల కందులు, 5 లక్షల 79 వేల 329 క్వింటాళ్ల శనగలను ప్రభుత్వం కొనుగోలు చేసింది.

రైతులకు ఇబ్బంది కలగకుండా ఉండేందుకే.. తాజా నిర్ణయాలు తీసుకున్నట్టు ప్రభుత్వం తెలిపింది. ఈ-కర్షక్ విధానంపై అవగాహన లేని కంది, శనగ రైతులకు ఈ చర్యలు ఉపశమనం కలిగించాయి.

First Published:  21 Feb 2020 2:48 AM IST
Next Story