అప్పట్లో చక్రం తిప్పిన ఈ బ్యాచ్‌కు ఏమైంది?
కావూరి సాంబశివరావు రాయపాటి సాంబశివరావు లగడపాటి రాజగోపాల్ కనుమూరి బాపిరాజు… కాంగ్రెస్ హయాంలో ఈ నలుగురు ఎంపీలు. కనుమూరి బాపిరాజును తప్పిస్తే… మిగతా ముగ్గురిదీ ఒకే సామాజికవర్గం. ఆంధ్రప్రదేశ్‌లో పేరు మోసిన పారిశ్రామిక వేత్తలు. ఒకప్పుడు కాంగ్రెస్‌లో వీరు తిప్పేది చక్రం. అంతగా వీరి హవా నడిచింది. ఇప్పుడు ఈ నలుగురు ఎక్కడా కనిపించడం లేదు. కనుమూరి బాపిరాజు ఏజ్ అయిపోయింది. ఆయన బయట కనిపించడం లేదు. మొన్నటి ఎన్నికల్లో నరసాపురం పార్లమెంట్ నుంచి పోటీ చేశారు. […]
కావూరి సాంబశివరావు
రాయపాటి సాంబశివరావు
లగడపాటి రాజగోపాల్
కనుమూరి బాపిరాజు…
కాంగ్రెస్ హయాంలో ఈ నలుగురు ఎంపీలు. కనుమూరి బాపిరాజును తప్పిస్తే… మిగతా ముగ్గురిదీ ఒకే సామాజికవర్గం. ఆంధ్రప్రదేశ్‌లో పేరు మోసిన పారిశ్రామిక వేత్తలు. ఒకప్పుడు కాంగ్రెస్‌లో వీరు తిప్పేది చక్రం. అంతగా వీరి హవా నడిచింది.
ఇప్పుడు ఈ నలుగురు ఎక్కడా కనిపించడం లేదు. కనుమూరి బాపిరాజు ఏజ్ అయిపోయింది. ఆయన బయట కనిపించడం లేదు. మొన్నటి ఎన్నికల్లో నరసాపురం పార్లమెంట్ నుంచి పోటీ చేశారు. ఆతర్వాత పూర్తిగా సైలెంట్ అయిపోయారు.
లగడపాటి రాజగోపాల్ తెలంగాణ ఎన్నికల సర్వేతో పూర్తిగా క్రెడిబులిటీ పొగొట్టుకున్నాడు. ఏపీ ఎన్నికల తర్వాత మిగతా విశ్వసనీయత పోయింది. దీంతో బయట కనిపిస్తే జనాలు నవ్వుకుంటారని… ఈయన తిరగడం లేదట. బెట్టింగ్‌ల కోసం సామాన్య జనంతో సర్వేల పేరుతో ఆడుకున్నారని ఈయనకు పేరు. తెలుగుదేశం అధికారంలో ఉన్న రోజుల్లో ఈయన హవా నడిచింది. కానీ ఆ తర్వాత ల్యాంకో ప్రాజెక్టులు దివాళా తీశాయి. వాటితో పాటు ఈయన పొలిటికల్ కెరీర్ ముగిసింది. దీంతో మిగిలిన చిన్న చిన్న వ్యాపారాలు చూసుకుంటున్నారట.
రాయపాటి సాంబశివరావు పొలిటికల్ కెరీర్ క్లైమాక్స్‌కు చేరింది. మొన్నటి ఎన్నికల్లో నరసరావుపేట టీడీపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. ఈయన బ్యాంకుల నుంచి అప్పుటు తీసుకొని ఎగ్గొట్టడంతో… ఇప్పుడు ఆస్తులు వేలానికి బ్యాంకులు రెడీ అయ్యాయి. తన వారసులను రాజకీయాల్లోకి తీసుకొచ్చే పనిలో ఉన్నాడట.
కావూరి సాంబశివరావు కూడా రాజకీయ ప్రస్థానం ముగింపు దశలో ఉంది. కాంగ్రెస్ ఓడిపోవడంతో ఈయన హవా కూడా తగ్గింది. ఆతర్వాత బీజేపీలో చేరాడు. అక్కడక్కడ కనిపించారు. ఇప్పుడు పూర్తిగా బయటకు రావడం లేదు. ఈయన మనవడు, బాలకృష్ణ అల్లుడు భరత్ మొన్నటి ఎన్నికల్లో విశాఖ ఎంపీగా పోటీ చేసి ఓడిపోయాడు. కావూరి వ్యాపారాలు కూడా పూర్తిగా దెబ్బతిన్నాయట. దీంతో ఈయన కూడా దివాళ బాటలో ఉన్నాడట.
మొత్తానికి ఒకప్పుడు చక్రం తిప్పిన ఈ నేతలంతా ఇప్పుడు ఆస్తులు కాపాడుకునేపనిలో ఉన్నారు. తెలంగాణ ఏర్పాటుతో వీరు కూడా రాజకీయ నిరుద్యోగులుగా మారారు. మొత్తానికి కాలం మహిమ…రాజకీయాల్లో ఏవిధంగా ఉంటుందో వీరిని చూస్తే తెలుస్తుందని అంటున్నారు.