Telugu Global
NEWS

జేసీ కుటుంబంపై మరో సంచలన ఆరోపణ

టీడీపీ మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి వ్యాపార లావాదేవీల విషయంలో వెలుగులోకి వచ్చిన వ్యవహారం.. రాజకీయంగా సంచలనాన్ని సృష్టిస్తోంది. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించి మోసం చేశారంటూ.. పలువురు వ్యక్తులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతోనే ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఈ ఫిర్యాదుకు సంబంధించి… మీడియాలో వస్తున్న కథనాలు, అందులో బాధితులు చెబుతున్న ప్రకారం.. వివరాలు ఇలా ఉన్నాయి. సుప్రీం కోర్టు బీఎస్ 3 రకం వాహనాలను ఇప్పటికే నిషేధించింది. అయినా.. ఆ రకానికే చెందిన కొన్ని […]

జేసీ కుటుంబంపై మరో సంచలన ఆరోపణ
X

టీడీపీ మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి వ్యాపార లావాదేవీల విషయంలో వెలుగులోకి వచ్చిన వ్యవహారం.. రాజకీయంగా సంచలనాన్ని సృష్టిస్తోంది. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించి మోసం చేశారంటూ.. పలువురు వ్యక్తులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతోనే ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఈ ఫిర్యాదుకు సంబంధించి… మీడియాలో వస్తున్న కథనాలు, అందులో బాధితులు చెబుతున్న ప్రకారం.. వివరాలు ఇలా ఉన్నాయి.

సుప్రీం కోర్టు బీఎస్ 3 రకం వాహనాలను ఇప్పటికే నిషేధించింది. అయినా.. ఆ రకానికే చెందిన కొన్ని వాహనాలతో పాటు.. మరిన్ని లారీలను కొని.. తప్పుడు పత్రాలతో నాగాలాండ్ లో 68 లారీలను రిజిస్టర్ చేయించారంటూ జేసీ దివాకర్ రెడ్డిపై అనంతపురం ఎస్పీకి ఫిర్యాదు అందింది. తుక్కు కింద ఈ 68 లారీలను.. ఒక్కోటి 6 లక్షలకు కొన్నారని.. తర్వాత వాటిలో 10 వాహనాలను సామాన్యులకు 23 లక్షల రూపాయల చొప్పున అమ్మారని తేలింది.

మిగిలిన లారీలను.. జేసీ ట్రావెల్స్ సొంతంగా నడుపుతున్నట్టు తెలుస్తోంది. ఈ వాహనాల్లో బీఎస్ 3 లారీలు 3 ఉన్నట్టుగా సమాచారం. తాము మోసపోయామని తెలుసుకున్న సామాన్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకే.. అనంతపురం పోలీసులు స్పందించారు. రవాణా శాఖ అధికారులు కూడా ఇచ్చిన ఫిర్యాదు మేరకు.. జేసీ ట్రావెల్స్ నిర్వాహకులపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

ఇప్పటికే జేసీ ట్రావెల్స్ లో జరుగుతున్న వ్యవహారాలపై సంచలన ఆరోపణలు వెలుగుచూడగా.. ఇప్పుడు ఏకంగా పోలీసుకేసు వరకూ విషయం వెళ్లింది. రాజకీయంగానూ ఈ పరిణామం సంచలనంగా మారింది.

First Published:  21 Feb 2020 2:41 AM IST
Next Story