Telugu Global
National

400 కోట్ల అప్పు ఎగ్గొట్టిన సుజనా చౌదరి.... ఆస్తుల వేలానికి బ్యాంక్ ఆఫ్ ఇండియా నోటీసు !

బీజేపీ ఎంపీ సుజనా చౌదరికి చెందిన సుజనా యూనివర్సల్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అనే కంపెనీ కొన్ని ఆస్తులను తనఖా పెట్టి 2018 అక్టోబరులో 322 కోట్ల రూపాయల రుణం తీసుకుంది. ఈ రుణాన్ని చెన్నైలోని బ్యాంక్ ఆఫ్ ఇండియా మంజూరు చేసింది. రుణం తీసుకునే సమయంలో సుజానా చౌదరి, వై. శివలింగప్రసాద్, వై. జతిన్ కుమార్, వై. శివరామకృష్ణ, ఎస్టీ. ప్రసాద్, గొట్టుముక్కల శ్రీనివాసరాజుతో పాటు పలు కంపెనీలు గ్యారెంటర్లుగా ఉన్నాయి. కాగా నెల నెల చెల్లించాల్సిన […]

400 కోట్ల అప్పు ఎగ్గొట్టిన సుజనా చౌదరి.... ఆస్తుల వేలానికి బ్యాంక్ ఆఫ్ ఇండియా నోటీసు !
X

బీజేపీ ఎంపీ సుజనా చౌదరికి చెందిన సుజనా యూనివర్సల్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అనే కంపెనీ కొన్ని ఆస్తులను తనఖా పెట్టి 2018 అక్టోబరులో 322 కోట్ల రూపాయల రుణం తీసుకుంది. ఈ రుణాన్ని చెన్నైలోని బ్యాంక్ ఆఫ్ ఇండియా మంజూరు చేసింది. రుణం తీసుకునే సమయంలో సుజానా చౌదరి, వై. శివలింగప్రసాద్, వై. జతిన్ కుమార్, వై. శివరామకృష్ణ, ఎస్టీ. ప్రసాద్, గొట్టుముక్కల శ్రీనివాసరాజుతో పాటు పలు కంపెనీలు గ్యారెంటర్లుగా ఉన్నాయి.

కాగా నెల నెల చెల్లించాల్సిన వడ్డీతో పాటు అసలు కూడా చెల్లించక పోవడంతో పలుమార్లు సుజానా చౌదరికి బ్యాంకు అధికారులు నోటీసులు జారీ చేశారు. వడ్డీతో కలిపి నేటికి 400 కోట్ల రూపాయలకు పైగా బాకీ ఉన్నారని.. వెంటనే సదరు మొత్తం చెల్లించాలని నోటీసులు పంపింది. వీటికి సుజనా చౌదరి గానీ, గ్యారెంటర్లు గానీ స్పందించకపోవడంతో ఆస్తులు వేలం వేస్తున్నట్లు ఇవాళ పత్రికల్లో ప్రకటనలు జారీ చేసింది.

మార్చి 20వ తేదీన తనఖా పెట్టిన ఆస్తులను పరిశీలించవచ్చని.. 21వ తేదీన ఆస్తుల కోసం బిడ్లు దాఖలు చేయవచ్చని ప్రకటనలో కోరింది. ఇక 23వ తేదీన అర్హులైన వాళ్లు ఈ – ఆక్షన్ విధానంలో తనఖా ఆస్తులను కొనుగోలు చేయవచ్చని బ్యాంకు అధికారులు ప్రకటనలో స్పష్టం చేశారు.

First Published:  20 Feb 2020 6:03 AM GMT
Next Story