Telugu Global
National

వంద ఇవ్వండి... పాస్ అవ్వండి : ప్రిన్సిపల్ బంపర్ ఆఫర్

అతను ఒక కళాశాలకు ప్రిన్సిపల్. విద్యార్థులకు విద్యాబుద్దులు నేర్పించడంతో పాటు క్రమశిక్షణగా ఎలా మెలగాలి.. మంచిగా ఎలా బతకాలి అనే విషయాలు బోధించాలి. కాని యూపీలోని ఈ ప్రిన్సిపల్ మాత్రం క్లాసులో విద్యార్థులకు అవినీతి పాఠాలు బోధిస్తున్నాడు. పరీక్షల్లో పాస్ కావడానికి ఎన్ని అడ్డదారులున్నాయో చెప్పుకొచ్చాడు. చివరకు పోలీసులు అతడిని కటకటాల వెనుకకు నెట్టారు. వివరాల్లోకి వెళితే.. యూపీలోని మావు జిల్లా హరివంశ్ మెమోరియల్ ఇంటర్ కళాశాల ప్రధానోపాధ్యాయుడు ప్రవీణ్ మాల్ తన విద్యార్థులకు పరీక్షల్లో ఎలా పాస్ […]

వంద ఇవ్వండి... పాస్ అవ్వండి : ప్రిన్సిపల్ బంపర్ ఆఫర్
X

అతను ఒక కళాశాలకు ప్రిన్సిపల్. విద్యార్థులకు విద్యాబుద్దులు నేర్పించడంతో పాటు క్రమశిక్షణగా ఎలా మెలగాలి.. మంచిగా ఎలా బతకాలి అనే విషయాలు బోధించాలి. కాని యూపీలోని ఈ ప్రిన్సిపల్ మాత్రం క్లాసులో విద్యార్థులకు అవినీతి పాఠాలు బోధిస్తున్నాడు. పరీక్షల్లో పాస్ కావడానికి ఎన్ని అడ్డదారులున్నాయో చెప్పుకొచ్చాడు. చివరకు పోలీసులు అతడిని కటకటాల వెనుకకు నెట్టారు. వివరాల్లోకి వెళితే..

యూపీలోని మావు జిల్లా హరివంశ్ మెమోరియల్ ఇంటర్ కళాశాల ప్రధానోపాధ్యాయుడు ప్రవీణ్ మాల్ తన విద్యార్థులకు పరీక్షల్లో ఎలా పాస్ కావాలో చెప్పాడు. అయితే అది చదివి పాస్ కావడం కాదు.. లంచమిచ్చి, కాపీ కొట్టి పాస్ అయ్యే దారులు చెప్పాడు. ఒక మార్కు, రెండు మార్కుల ప్రశ్నల కోసం మీరు మీ పక్కనున్న వాళ్లను అడుక్కోవచ్చు. మిమ్మల్ని ఇన్విజిలేటర్లు కూడా ఎవరూ ఏం చేయరు. ఎందుకంటే వాళ్లందరూ నా స్నేహితులు అని చెప్పాడు.

అలాగే పరీక్షల్లో ఏ ప్రశ్నా వదలకుండా మీకు తోచిందేదో రాసేయండి.. చివర్లో ఆ జవాబు పత్రాల్లో ఒక వంద నోటు కూడా జత చేయండి.. అందరినీ పాస్ చేయించే బాధ్యత నాది అని అన్నాడు. దీనికి విద్యార్థులు కూడా అవును ఇదేదో బాగుంది అని జవాబిచ్చారు.

కాగా, ఈ తతంగాన్నంతా ఒక విద్యార్థి వీడియో తీసి ఏకంగా సీఎం యోగీ ఆదిత్యానాథ్‌కు పంపించాడు. దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన సీఎం.. వెంటనే స్థానిక పోలీసులకు ఆదేశించి సదరు ప్రిన్సిపల్‌ను అరెస్టు చేయించాడు.

First Published:  20 Feb 2020 5:03 AM GMT
Next Story