Telugu Global
NEWS

నాన్న ఆస్తి పెరిగింది... అమ్మ ఆస్తి తగ్గింది : ప్రకటించిన నారా లోకేష్

నారా ఫ్యామిలీ ఆస్తుల వివరాలను నారా లోకేష్ ఇవాళ ప్రకటించారు. ప్రతీ ఏడాది ప్రకటించినట్లుగానే ఇవాళ మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో తమ కుటుంబ ఆస్తులను మీడియాకు వెల్లడించారు. చంద్రబాబు నాయుడు ఆస్తి 9 కోట్ల రూపాయలని, అప్పులు 5.13 కోట్లు అని లోకేష్ చెప్పారు. గత ఏడాది కంటే చంద్రబాబు ఆస్తి 87 లక్షల రూపాయలు పెరిగినట్లు ఆయన చెప్పారు. ఇక అమ్మ భువనేశ్వరికి 50 కోట్ల రూపాయల ఆస్తి ఉందని.. గతంలో కంటే ఆమె […]

నాన్న ఆస్తి పెరిగింది... అమ్మ ఆస్తి తగ్గింది : ప్రకటించిన నారా లోకేష్
X

నారా ఫ్యామిలీ ఆస్తుల వివరాలను నారా లోకేష్ ఇవాళ ప్రకటించారు. ప్రతీ ఏడాది ప్రకటించినట్లుగానే ఇవాళ మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో తమ కుటుంబ ఆస్తులను మీడియాకు వెల్లడించారు. చంద్రబాబు నాయుడు ఆస్తి 9 కోట్ల రూపాయలని, అప్పులు 5.13 కోట్లు అని లోకేష్ చెప్పారు. గత ఏడాది కంటే చంద్రబాబు ఆస్తి 87 లక్షల రూపాయలు పెరిగినట్లు ఆయన చెప్పారు.

ఇక అమ్మ భువనేశ్వరికి 50 కోట్ల రూపాయల ఆస్తి ఉందని.. గతంలో కంటే ఆమె ఆస్తులు తగ్గిపోయాయని చెప్పారు. తనకు 8.14 కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయని.. తన పేరిట ఉన్న షేర్లను భార్య బ్రాహ్మణికి బహుమతిగా ఇచ్చానన్నారు. గతంలో కంటే తన ఆస్తి 2.40 కోట్ల రూపాయల మేర తగ్గిపోయిందని చెప్పుకొచ్చారు. బ్రాహ్మణికి 15.68 కోట్ల రూపాయలు, దేవామ్ష్ కు 19.42 కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నట్లు చెప్పారు.

రాజకీయాలపై ఆధారపడకూడదనే తాము హెరిటేజ్ అనే సంస్థను స్థాపించామని.. దాదాపు 15 రాష్ట్రాల్లో తమ పాల ఉత్పత్తులు విక్రయిస్తున్నట్లు తెలిపారు. తమ సంస్థ ద్వారా 3 వేల మందికి ఉపాధి కల్పిస్తున్నట్లు చెప్పారు. 9 రాష్ట్రాల్లో హెరిటేజ్ సంస్థకు ఆస్తులు ఉన్నాయని చెప్పారు.

ఇక రాజధాని ప్రాంతంలో హెరిటేజ్ సంస్థకు ఆస్తులు ఉన్నాయన్న ఆరోపణల్లో నిజం లేదని చెప్పారు. 2014 మార్చిలో రాజధాని పరిధికి 30 కిలోమీటర్ల దూరంలో హెరిటేజ్ కోసం భూములు కొన్నట్లు చెప్పారు. గత తొమ్మిదేళ్లుగా ఆస్తులను ప్రకటిస్తూ సవాల్ విసురుతున్నా ఎవరూ స్వీకరించడం లేదని ఆయన అన్నారు. తమ కుటుంబ సభ్యులపై ఆరోపణలు చేయడం సరి కాదని లోకేష్ అన్నారు.

First Published:  20 Feb 2020 6:06 AM GMT
Next Story