Telugu Global
NEWS

మిత్రుడే శత్రువుగా మారితే.... ఇలాగే ఉంటుంది

కేంద్ర ప్రభుత్వం చేసిన సిటిజన్ షిప్ అమెండ్ మెంట్ యాక్ట్ కు బీహార్ అధికార పార్టీ జేడీయూ.. పార్లమెంటులో అనుకూలంగా ఓటు వేయడం.. ఆ పార్టీని ఇబ్బందుల్లోకి నెడుతోంది. ప్రముఖ రాజకీయ వ్యూహకర్త, కొంత కాలం క్రితం వరకు జేడీయూలో కీలకంగా వ్యవహరించిన ప్రశాంత్ కిషోర్.. ఈ పరిణామం తర్వాత నితీష్ ను కాదనుకుని జేడీయూ నుంచి బయటికి వెళ్లారు. బీజేపీకి అనుకూలంగా నడుచుకుంటున్న నితీశ్ తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తాజాగా.. బాత్ బీహార్ […]

మిత్రుడే శత్రువుగా మారితే.... ఇలాగే ఉంటుంది
X

కేంద్ర ప్రభుత్వం చేసిన సిటిజన్ షిప్ అమెండ్ మెంట్ యాక్ట్ కు బీహార్ అధికార పార్టీ జేడీయూ.. పార్లమెంటులో అనుకూలంగా ఓటు వేయడం.. ఆ పార్టీని ఇబ్బందుల్లోకి నెడుతోంది. ప్రముఖ రాజకీయ వ్యూహకర్త, కొంత కాలం క్రితం వరకు జేడీయూలో కీలకంగా వ్యవహరించిన ప్రశాంత్ కిషోర్.. ఈ పరిణామం తర్వాత నితీష్ ను కాదనుకుని జేడీయూ నుంచి బయటికి వెళ్లారు. బీజేపీకి అనుకూలంగా నడుచుకుంటున్న నితీశ్ తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

తాజాగా.. బాత్ బీహార్ కీ పేరుతో.. సరికొత్త రాజకీయ ప్రయాణాన్ని ప్రశాంక్ కిషోర్ మొదలుపెట్టారు. ఈ నెల 20న.. అంటే రేపటినుంచే (ఫిబ్రవరి 20, 2020- గురువారం) బీహార్ వ్యాప్తంగా వంద రోజుల పాటు పర్యటించబోతున్నట్టు చెప్పారు. గాడ్సే సిద్ధాంతాలకు అనుగుణంగా పని చేసే వారితో.. గాంధీవాదులు కలవరు అంటూ.. తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బీహార్ లో ఏం జరుగుతోందో ఈ వంద రోజుల పాటు ప్రజలకు వివరిస్తానని చెప్పారు.

ఈ ప్రకటన చేసినప్పుడే ప్రశాంత్ కిషోర్.. కొన్ని కీలక విషయాలు లేవనెత్తారు. “రాష్ట్రంలో అభివృద్ధిలో బీహార్ 22వ స్థానంలో ఉంది. 10వ స్థానానికి చేరాలని కోరుకుంటున్నా. లాలూ హయాంలో జరిగిన అభివృద్ధిని విమర్శించిన మీరు.. గత 15 ఏళ్లలో ఏం సాధించారు? రాష్ట్ర ప్రజలు ఉద్యోగాల కోసం వలస పోతుంటే ఏం చేస్తున్నారు? 15 ఏళ్లుగా మహారాష్ట్ర, కర్ణాటకతో పోలిస్తే ఏం అభివృద్ధి సాధించారు?” అని ముఖ్యమంత్రి నితీశ్ ను ప్రశ్నించారు.

ఈ విమర్శల తీవ్రత చూస్తుంటే.. నితీశ్ ను పీకే రాజకీయంగా ఇరుకున పెట్టడం ఖాయంగా కనిపిస్తోంది. బీహార్ వేదికగా ప్రశాంత్ కిషోర్ సొంత రాజకీయ పార్టీ కూడా పెట్టేస్తారేమో… అన్న చర్చ అంతటా విస్తృతంగా జరుగుతోంది. ఒకప్పుడు మిత్రుడిగా ఉన్న శక్తే.. ఇప్పుడు శత్రువుగా మారితే ఇలాగే ఉంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

First Published:  19 Feb 2020 2:20 AM IST
Next Story