జగన్ ఆ ఒక్కటీ ఇస్తారా ?
దేశవ్యాప్తంగా మార్చిలో రాజ్యసభ ఎన్నికలు జరగబోతున్నాయి. ఏపీలో కూడా నాలుగు సీట్లు ఖాళీ కాబోతున్నాయి. ఆ నాలుగు సీట్లు వైసీపీకి దక్కనున్నాయ. వైసీపీ సంఖ్యా బలం 151. దీంతో ప్రతిపక్షాలకు ఒక్క సీటు కూడా దక్కే చాన్స్ లేదు. ఈ నాలుగు సీట్లకు జగన్ ఎవరిని ఎంపిక చేస్తారనేది ఓ పెద్ద ప్రశ్న. అయితే ఈ సీట్లలో ఒక సీటు తమకు ఇవ్వమని బీజేపీ అడుగుతోందట. ఇటీవల ఢిల్లీ వెళ్లిన జగన్‌ను బీజేపీ పెద్దలు రాజ్యసభ సీటు […]

దేశవ్యాప్తంగా మార్చిలో రాజ్యసభ ఎన్నికలు జరగబోతున్నాయి. ఏపీలో కూడా నాలుగు సీట్లు ఖాళీ కాబోతున్నాయి. ఆ నాలుగు సీట్లు వైసీపీకి దక్కనున్నాయ. వైసీపీ సంఖ్యా బలం 151. దీంతో ప్రతిపక్షాలకు ఒక్క సీటు కూడా దక్కే చాన్స్ లేదు.
ఈ నాలుగు సీట్లకు జగన్ ఎవరిని ఎంపిక చేస్తారనేది ఓ పెద్ద ప్రశ్న. అయితే ఈ సీట్లలో ఒక సీటు తమకు ఇవ్వమని బీజేపీ అడుగుతోందట. ఇటీవల ఢిల్లీ వెళ్లిన జగన్‌ను బీజేపీ పెద్దలు రాజ్యసభ సీటు గురించి అడిగారట.
రాజ్యసభలో ప్రతిపక్షాల బలం బీజేపీని కలవరపెడుతోంది. అధికారంలోకి వచ్చి ఆరేళ్లు దగ్గర పడుతోంది. అయితే పెద్దల సభలో మాత్రం ఇంకా బీజేపీ బలం పెరగలేదు. కీలకమైన బిల్లుల విషయంలో ఇతర పార్టీలపై ఆధారపడాల్సి వస్తోంది. దీంతో రాజ్యసభలో బలం పెంచుకునే పనిలో బీజేపీ ఉంది. ఇందులో భాగంగా ఏపీలో ఒక సీటు కోసం తెగ ప్రయత్నాలు చేస్తోందట.
ఇంతకుముందు కూడా ఏపీ నుంచి బీజేపీ తరపున ఒకరిని రాజ్యసభకు పంపేవారు. టీడీపీ హాయాంలో నిర్మలా సీతారామన్, సురేష్ ప్రభు రాజ్యసభకు వెళ్లారు. ఈ సారి బీజేపీ నుంచి ఎవరు వెళతారనేది ఇంట్రెస్టింగ్. ఒక సీటు మాత్రం బీజేపీకి జగన్ ఇవ్వడం ఖాయమని తెలుస్తోంది. ఈ వారం, పదిరోజుల్లో రాజ్యసభ సీటుపై పార్టీలో ఇతర నేతలకు జగన్ క్లారిటీ ఇచ్చే అవకాశం ఉందని అంటున్నారు.