Telugu Global
CRIME

కాస్త అప్రమత్తంగా ఉంటే... ఇంతటి దారుణం తప్పేది...

హైదరాబాద్ లోని ఎస్ఆర్ నగర్ లో జరిగిన రోడ్డు ప్రమాదం…. ఒక్కసారిగా అందరినీ అలర్ట్ అయ్యేలా చేసింది. వాహనదారులకు తోడు.. రోడ్డుదాటుతున్న పాదాచారులు.. అప్రమత్తంగా లేకుంటే.. రెప్పపాటులో ప్రాణాపాయం ఎలా ముంచుకు వస్తుందన్నదానికి తాజా ఘటన స్పష్టమైన ఉదాహరణగా మిగులుతోంది. తప్పు ఎవరిదన్న చర్చను పక్కన పెడితే.. ఎవరికి వారు తమ పనిలో ఉండి.. పరిసరాలను పట్టించుకోకపోవడమే ప్రమాదానికి కారణంగా…. స్పష్టంగా తెలుస్తోంది. తాజా ఘటనను పరిశీలిస్తే.. ఓ వైపు నుంచి మరో వైపునకు అలేఖ్య అనే […]

కాస్త అప్రమత్తంగా ఉంటే... ఇంతటి దారుణం తప్పేది...
X

హైదరాబాద్ లోని ఎస్ఆర్ నగర్ లో జరిగిన రోడ్డు ప్రమాదం…. ఒక్కసారిగా అందరినీ అలర్ట్ అయ్యేలా చేసింది. వాహనదారులకు తోడు.. రోడ్డుదాటుతున్న పాదాచారులు.. అప్రమత్తంగా లేకుంటే.. రెప్పపాటులో ప్రాణాపాయం ఎలా ముంచుకు వస్తుందన్నదానికి తాజా ఘటన స్పష్టమైన ఉదాహరణగా మిగులుతోంది. తప్పు ఎవరిదన్న చర్చను పక్కన పెడితే.. ఎవరికి వారు తమ పనిలో ఉండి.. పరిసరాలను పట్టించుకోకపోవడమే ప్రమాదానికి కారణంగా…. స్పష్టంగా తెలుస్తోంది.

తాజా ఘటనను పరిశీలిస్తే.. ఓ వైపు నుంచి మరో వైపునకు అలేఖ్య అనే యువతి రోడ్డు దాటుతుండగా ఈ ప్రమాదం జరిగింది. ఆమె రోడ్డు దాటుతున్న సమయంలో.. రహదారి మధ్యలోకి చేరుకోగానే ఓ బైకు అడ్డు వచ్చింది. ఆ బైకు వెనకే కారు ఉంది. బైకును తాకిన అలేఖ్య.. ఆ వెనక నుంచి వచ్చిన కారు కింద పడిపోయింది. కారు డ్రైవింగ్ చేస్తున్న వ్యక్తి అది గమనించాడో లేడో తెలియదు. ఫలితంగా.. కారు చక్రాల కింద అలేఖ్య పడిపోయింది… కొంచెం దూరం ఈడ్చుకుపోయింది కారు.

ఈ ఘటనలో.. రోడ్డు మధ్యలో వస్తున్న వాహనాలను అలేఖ్య కాస్త జాగ్రత్తగా గమనించి ఉంటే ఈ ఘటన జరిగి ఉండేది కాదని అంటున్నారు. బైకుపై వస్తున్న వ్యక్తి అయినా.. రోడ్డుపై ఉన్న జనాలను గమనిస్తే ఆమెను ఢీ కొట్టి ఉండేవాడు కాదు. కారు డ్రైవింగ్ చేస్తున్న వ్యక్తి అప్రమత్తంగా ఉన్నా.. అలేఖ్య కారు టైర్ల కింద పడిపోయేది కాదు. కారణం ఏదైనా… చివరికి ఘోరం జరిగింది. రహదారులపై ప్రతిక్షణం.. ఎంత అప్రమత్తంగా ఉండాలి.. ఎలాంటి జాగ్రత్తలు పాటిచాలి అన్న విషయాన్ని ఈ ప్రమాదం జనానికి మరోసారి గుర్తు చేసింది.

First Published:  18 Feb 2020 6:26 AM IST
Next Story