సైనా, శ్రీకాంత్ ల సత్తాకు సవాల్
ఒలింపిక్స్ బెర్త్ ల వేటలో భారతస్టార్ షట్లర్లు భారత బ్యాడ్మింటన్ స్టార్ ప్లేయర్లు కిడాంబీ శ్రీకాంత్, సైనా నెహ్వాల్ టోక్యో ఒలింపిక్స్ బెర్త్ లు సాధించడం కోసం నానాపాట్లు పడతున్నారు. గత ఏడాదికాలంగా… చెప్పుకోదగిన విజయం అంటూ ఏదీలేని సైనా, శ్రీకాంత్ ర్యాంకింగ్స్ లో దారుణంగా పడిపోయారు. అంతర్జాతీయ బ్యాడ్మింటన్ సమాఖ్య ర్యాంకింగ్స్ ప్రకారం సైనా 18, శ్రీకాంత్ 15 ర్యాంకుల్లో కొనసాగుతున్నారు. ఒలింపిక్స్ నిబంధనల ప్రకారం…ప్ర పంచ బ్యాడ్మింటన్ మొదటి 16 ర్యాంకుల్లో నిలిచిన ప్లేయర్లకు మాత్రమే ఒలింపిక్స్ […]
- ఒలింపిక్స్ బెర్త్ ల వేటలో భారతస్టార్ షట్లర్లు
భారత బ్యాడ్మింటన్ స్టార్ ప్లేయర్లు కిడాంబీ శ్రీకాంత్, సైనా నెహ్వాల్ టోక్యో ఒలింపిక్స్ బెర్త్ లు సాధించడం కోసం నానాపాట్లు పడతున్నారు. గత ఏడాదికాలంగా… చెప్పుకోదగిన విజయం అంటూ ఏదీలేని సైనా, శ్రీకాంత్ ర్యాంకింగ్స్ లో దారుణంగా పడిపోయారు.
అంతర్జాతీయ బ్యాడ్మింటన్ సమాఖ్య ర్యాంకింగ్స్ ప్రకారం సైనా 18, శ్రీకాంత్ 15 ర్యాంకుల్లో కొనసాగుతున్నారు. ఒలింపిక్స్ నిబంధనల ప్రకారం…ప్ర పంచ బ్యాడ్మింటన్ మొదటి 16 ర్యాంకుల్లో నిలిచిన ప్లేయర్లకు మాత్రమే ఒలింపిక్స్ పురుషుల, మహిళల సింగిల్స్ లో పాల్గొనే అవకాశం ఉంది.
భారత ప్లేయర్లలో పీవీ సింధు, సాయి ప్రణీత్ సింగిల్స్ లో, రిత్విక్-చిరాగ్ షెట్టి జోడీ డబుల్స్ లోనూ ఒలింపిక్స్ బెర్త్ లు దాదాపు ఖాయం చేసుకొన్నారు.
సైనా, శ్రీకాంత్ మాత్రం …ఏప్రిల్ నాటికి తమ ర్యాంకింగ్స్ స్థానాలు మెరుగుపరచుకొని ..మొదటి 16 ర్యాంకుల్లో నిలువగలిగితేనే ఒలింపిక్స్ లో పాల్గొనే వీలుంది.
టోక్యో ఒలింపిక్స్ రేస్ ర్యాంకింగ్స్ లో మాత్రం సైనా 22, శ్రీకాంత్ 26 స్థానాల్లో మాత్రమే ఉన్నారు.
వచ్చే రెండుమాసాల కాలంలో జరిగే ఏడు అంతర్జాతీయ బ్యాడ్మింటన్ ర్యాంకింగ్స్ టోర్నీలలో పాల్గొనడం ద్వారా…శ్రీకాంత్, సైనా సాధ్యమైనన్ని ఎక్కువ ర్యాంకింగపాయింట్లు సాధించగలిగితేనే ఒలింపిక్స్ బెర్త్ లు ఖాయం చేసుకొనే వీలుంది.
బార్సిలోనా మాస్టర్స్ టోర్నీ ద్వారా ర్యాంకింగ్ పాయింట్ల వేటను ఇటు సైనా, అటు శ్రీకాంత్ కొనసాగించనున్నారు.