మున్సిపల్ కార్యాలయాలపై ఏసీబీ పంజా !
ఏపీ సీఎం వైఎస్ జగన్ అవినీతి అధికారుల భరతం పట్టేలా చర్యలు తీసుకుంటున్నారు. ఇన్నాళ్లూ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలపై దృష్టి పెట్టిన సీఎం ఇక ఇప్పుడు అవినీతిపై యుద్దం ప్రకటించారు. మంగళవారం ఉదయం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పలు మున్సిపల్ కార్యాలయాలపై ఏసీబీ అధికారులు ఆకస్మిక దాడులు చేశారు. గత కొంత కాలంగా మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల పరిధిలోని బిల్డింగ్ సెక్షన్, టౌన్ ప్లానింగ్‌కు సంబంధించి పలు పిర్యాదులు రాష్ట్ర ప్రభుత్వానికి చేరాయి. టోల్ ఫ్రీ నెంబర్‌కు […]
ఏపీ సీఎం వైఎస్ జగన్ అవినీతి అధికారుల భరతం పట్టేలా చర్యలు తీసుకుంటున్నారు. ఇన్నాళ్లూ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలపై దృష్టి పెట్టిన సీఎం ఇక ఇప్పుడు అవినీతిపై యుద్దం ప్రకటించారు.
మంగళవారం ఉదయం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పలు మున్సిపల్ కార్యాలయాలపై ఏసీబీ అధికారులు ఆకస్మిక దాడులు చేశారు. గత కొంత కాలంగా మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల పరిధిలోని బిల్డింగ్ సెక్షన్, టౌన్ ప్లానింగ్‌కు సంబంధించి పలు పిర్యాదులు రాష్ట్ర ప్రభుత్వానికి చేరాయి.
టోల్ ఫ్రీ నెంబర్‌కు కాల్ చేసి చాలా మంది బాధితులు అధికారుల వేధింపులను ఏకరువు పెట్టారు. ఇది సీఎం దృష్టికి వెళ్లింది. ఆయన ఓకే అనడంతో ఒకే సారి పలు మున్సిపాలిటీలు, కార్పొరేషన్ కార్యాలయాలపై దాడులు జరిగాయి.
నెల్లూరులో ఏసీబీ డీఎస్పీ దేవానంద్ శాంత్రో, పొద్దుటూరులో కడప ఏసీబీ డీఎస్పీ జనార్థన్ నాయుడు, కాకినాడలో ఏసీబీ అడిషనల్ ఎస్పీ రవికుమార్ ఆధ్వర్యంలో తనిఖీలు జరిగాయి. టౌన్ ప్లానింగ్ కార్యాలయాల్లోని పలు ఫైళ్లు, రికార్డులను పరిశీలించారు.
రాష్ట్రవ్యాప్తంగా దాడులు జరిగిన మున్సిపల్ కార్యాలయాలు ఇవే.
1. శ్రీకాకుళం మున్సిపాలిటీ
2. విజయనగరం మున్సిపాలిటీ
3. గాజువాక జోన్, మధురవాడ జోన్ (జీవీఎంసీ)
4. కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్
5. తాడేపల్లిగూడెం మున్సిపాలిటీ (పశ్చిమ గోదావరి)
6. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్
7. గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్
8. ఒంగోలు మున్సిపాలిటీ (ప్రకాశం జిల్లా)
9. నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్
10. తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ (చిత్తూరు జిల్లా)
11. పొద్దుటూరు మున్సిపాలిటీ (కడప జిల్లా)
12. ఎమ్మిగనూరు మున్సిపాలిటీ (కర్నూలు జిల్లా)
13. కదిరి మున్సిపాలిటీ (అనంతపురం జిల్లా)