వర్క్ బిజీలో వర్మ... శంషాబాద్ ఏసీపీతో 'దిశ' కేసుపై చర్చ..!
ఇండియాలో ఏ సంఘటన జరిగినా ఒక్కొక్కళ్లు ఒక్కో విధంగా స్పందిస్తుంటారు. కాని వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ మాత్రం తనదైన శైలిలో సినిమా తీసి డబ్బులు సంపాదించాలని భావిస్తుంటాడు. అండర్ వరల్డ్ డాన్ నుంచి ముంబై పేలుళ్ల వరకు.. వంగవీటి నుంచి ఎన్టీఆర్ వరకు.. ప్రతీ వివాదాన్ని కమర్షియలైజ్ చేసి తెరపై తన భావాలను ప్రదర్శిస్తుంటాడు. ఈ క్రమంలో ఆర్జీవీ సక్సెస్‌లు చూశాడు.. ఫెయిల్యూర్లు చూశాడు. అయినా తన ప్రయత్నం మాత్రం ఆపడు. ఎన్ని విమర్శలు వచ్చినా […]
ఇండియాలో ఏ సంఘటన జరిగినా ఒక్కొక్కళ్లు ఒక్కో విధంగా స్పందిస్తుంటారు. కాని వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ మాత్రం తనదైన శైలిలో సినిమా తీసి డబ్బులు సంపాదించాలని భావిస్తుంటాడు. అండర్ వరల్డ్ డాన్ నుంచి ముంబై పేలుళ్ల వరకు.. వంగవీటి నుంచి ఎన్టీఆర్ వరకు.. ప్రతీ వివాదాన్ని కమర్షియలైజ్ చేసి తెరపై తన భావాలను ప్రదర్శిస్తుంటాడు.
ఈ క్రమంలో ఆర్జీవీ సక్సెస్‌లు చూశాడు.. ఫెయిల్యూర్లు చూశాడు. అయినా తన ప్రయత్నం మాత్రం ఆపడు. ఎన్ని విమర్శలు వచ్చినా తన పని తాను చేసుకొని పోతూనే ఉంటాడు. తాజాగా హైదరాబాద్ నగర శివార్లలో జరిగిన దిశ అత్యాచారం, హత్య.. తదనంతరం నిందితుల ఎన్‌కౌంటర్ వార్తల్లో చర్చనీయాంశాలుగా మారాయి. దేశ వ్యాప్తంగా ఈ ఘటనల పరంపర సంచలనం సృష్టించింది. దీనినే ఇప్పుడు సినిమాగా మలచబోతున్నాడు ఆర్జీవీ.
ఇప్పటికే నలుగురు నిందితుల్లో ఒకరైన చెన్నకేశవులు భార్యతో భేటీ అయి పలు విషయాలు తెలుసుకున్నాడు. ఇక ఇప్పుడు శంషాబాద్ ఏసీపీని కలసి ‘దిశ’ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకున్నట్లు స్వయంగా మీడియాకు తెలిపాడు. తాను దిశ ఘటన గురించిన సమాచారం తెలుసుకోవడానికి శంషాబాద్ ఏసీపీని కలిసినట్లు ఆర్జీవీ వెల్లడించాడు. దిశ సినిమా తీయడానికి అన్ని కోణాల నుంచి తనదైన శైలిలో వివరాలు రాబడుతున్నానని.. అవసరమైన పరిశోధన కూడా చేస్తున్నట్లు ఆర్జీవీ తెలిపాడు.