రంజీట్రోఫీ క్వార్టర్స్ లో బెంగాల్, కర్నాటక
లీగ్ దశ నుంచి ఢిల్లీ అవుట్ దేశవాళీ రంజీ (2019-20 సీజన్ )ట్రోఫీ టైటిల్ వేటలో మాజీ చాంపియన్లు కర్నాటక, బెంగాల్ దూసుకుపోతున్నాయి. మరో మాజీ చాంపియన్ ఢిల్లీ జట్టు పోటీ మాత్రం.. గ్రూపు లీగ్ దశలోనే ముగిసింది. గ్రూప్ లీగ్ ఆఖరిరౌండ్ పోటీలలో పంజాబ్ పై బెంగాల్, బరోడాపై కర్నాటక జట్లు విజయాలతో నాకౌట్ రౌండ్ బెర్త్ లు ఖాయం చేసుకొన్నాయి. బెంగాల్ తో ముగిసిన కీలక సమరంలో విజయానికి అవసరమైన 190 పరుగుల లక్ష్యాన్ని పంజాబ్ చేరుకోడంలో […]
- లీగ్ దశ నుంచి ఢిల్లీ అవుట్
దేశవాళీ రంజీ (2019-20 సీజన్ )ట్రోఫీ టైటిల్ వేటలో మాజీ చాంపియన్లు కర్నాటక, బెంగాల్ దూసుకుపోతున్నాయి. మరో మాజీ చాంపియన్ ఢిల్లీ జట్టు పోటీ మాత్రం.. గ్రూపు లీగ్ దశలోనే ముగిసింది.
గ్రూప్ లీగ్ ఆఖరిరౌండ్ పోటీలలో పంజాబ్ పై బెంగాల్, బరోడాపై కర్నాటక జట్లు విజయాలతో నాకౌట్ రౌండ్ బెర్త్ లు ఖాయం చేసుకొన్నాయి.
బెంగాల్ తో ముగిసిన కీలక సమరంలో విజయానికి అవసరమైన 190 పరుగుల లక్ష్యాన్ని పంజాబ్ చేరుకోడంలో విఫలమయ్యింది. 141 పరుగులకే కుప్పకూలడం ద్వారా 48 పరుగుల పరాజయంతో టోర్నీ నుంచి నిష్క్ర్రమించింది.
బెంగళూరు వేదికగా ముగిసిన మరో లీగ్ పోటీలో కర్నాటక 8 వికెట్లతో బరోడాను చిత్తు చేసింది. న్యూఢిల్లీ ఫిరోజ్ షా కోట్లా వేదికగా జరిగిన మరో ఆఖరిరౌండ్ పోరులో రాజస్థాన్ పై ఢిల్లీ భారీవిజయం సాధించినా…పాయింట్ల తేడాతో నాకౌట్ రౌండ్ చేరుకోడం లో విఫలమయ్యింది.