ముంబై- చెన్నైజట్ల మధ్య ఐపీఎల్ ప్రారంభమ్యాచ్
మార్చి 29 నుంచి మే 17 వరకూ లీగ్ సమరం ఇండియన్ ప్రీమియర్ లీగ్ పరంపరలో భాగంగా జరిగే 2020 సీజన్ పోటీల కార్యక్రమాన్ని నిర్వాహక సంఘం అధికారికంగా ఖరారు చేసింది. మార్చి 29 నుంచి మే 17 వరకూ రౌండ్ రాబిన లీగ్ సమరాన్ని, మే 24న టైటిల్ సమరాన్ని నిర్వహించాలని నిర్ణయించారు. వాంఖెడీలో ప్రారంభమ్యాచ్… ప్రపంచ టీ-20 లోనే అత్యంత భాగ్యవంతమైన ఐపీఎల్ లీగ్ 13వ సీజన్ తొలిమ్యాచ్ కు ముంబై వాంఖెడీ స్టేడియం […]
- మార్చి 29 నుంచి మే 17 వరకూ లీగ్ సమరం
ఇండియన్ ప్రీమియర్ లీగ్ పరంపరలో భాగంగా జరిగే 2020 సీజన్ పోటీల కార్యక్రమాన్ని నిర్వాహక సంఘం అధికారికంగా ఖరారు చేసింది. మార్చి 29 నుంచి మే 17 వరకూ రౌండ్ రాబిన లీగ్ సమరాన్ని, మే 24న టైటిల్ సమరాన్ని నిర్వహించాలని నిర్ణయించారు.
వాంఖెడీలో ప్రారంభమ్యాచ్…
ప్రపంచ టీ-20 లోనే అత్యంత భాగ్యవంతమైన ఐపీఎల్ లీగ్ 13వ సీజన్ తొలిమ్యాచ్ కు ముంబై వాంఖెడీ స్టేడియం ఆతిథ్యమివ్వనుంది. డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్, రన్నరప్ చెన్నై సూపర్ కింగ్స్ తో సహా మొత్తం ఎనిమిది ఫ్రాంచైజీల జట్లు పలుమార్పులు చేర్పులతో కూడిన జట్లతో టైటిల్ వేటకు దిగనున్నాయి.
మార్చి 29న వాంఖెడీ స్టేడియం వేదికగా చాంపియన్ ముంబై ఇండియన్స్ జట్టు సీజన్లో తన ప్రారంభమ్యాచ్ ఆడనుంది.
ఆదివారం రోజున మాత్రమే డబుల్ హెడ్డర్ మ్యాచ్ లు నిర్వహించనున్నారు. మార్చి 29 నుంచి మే 17 వరకూ లీగ్ మ్యాచ్ లు జరుగుతాయి. మే 18 నుంచి 24 వరకూ నాకౌట్ రౌండ్ మ్యాచ్ లు జరుగుతాయి.
మే 24న ముంబై వాంఖెడీ స్టేడియం వేదికగా జరిగే టైటిల్ సమరంతో లీగ్ కు తెరపడనుంది. మరోవైపు..మార్చి 29నే సీజన్ ప్రారంభం కావడంతో ఆస్ట్ర్రేలియా, న్యూజిలాండ్, ఇంగ్లండ్ దేశాలకు చెందిన పలువురు స్టార్ ప్లేయర్లు లేకుండానే ప్రారంభ రౌండ్ మ్యాచ్ లు ఆడాల్సి వస్తోందని ఢిల్లీ క్యాపిటల్స్ లాంటి జట్లు లబోదిబో అంటున్నాయి.
ఏడువారాలపాటు సాగే 60 మ్యాచ్ ల లీగ్ ను దేశంలోని వివిధ ఫ్రాంచైజీలకు చెందిన పది క్రికెట్ వేదికల్లో నిర్వహించనున్నారు.