ఆసియా బ్యాడ్మింటన్లో భారత్ కు పతకం ఖాయం
థాయ్ లాండ్ పై భారత్ సంచలన విజయం మనీలా వేదికగా జరుగుతున్న 2020 ఆసియా బ్యాడ్మింటన్ టీమ్ చాంపియన్షిప్ పురుషుల సెమీఫైనల్స్ కు భారత్ అనూహ్యంగా చేరుకొంది. క్వార్టర్ పైనల్లో పవర్ ఫుల్ థాయ్ లాండ్ ను 3-2తో అధిగమించి సెమీస్ బెర్త్ ఖాయం చేసుకోడం ద్వారా ఏదో ఒక పతకం దక్కించుకొనే స్థితిలో నిలిచింది. పురుషుల సింగిల్స్ లో సీనియర్ స్టార్లు కిడాంబీ శ్రీకాంత్, సాయి ప్రణీత్ పరాజయాలు పొందినా…డబుల్స్ , మూడో సింగిల్స్ లో నెగ్గడం […]
- థాయ్ లాండ్ పై భారత్ సంచలన విజయం
మనీలా వేదికగా జరుగుతున్న 2020 ఆసియా బ్యాడ్మింటన్ టీమ్ చాంపియన్షిప్ పురుషుల సెమీఫైనల్స్ కు భారత్ అనూహ్యంగా చేరుకొంది. క్వార్టర్ పైనల్లో పవర్ ఫుల్ థాయ్ లాండ్ ను 3-2తో అధిగమించి సెమీస్ బెర్త్ ఖాయం చేసుకోడం ద్వారా ఏదో ఒక పతకం దక్కించుకొనే స్థితిలో నిలిచింది.
పురుషుల సింగిల్స్ లో సీనియర్ స్టార్లు కిడాంబీ శ్రీకాంత్, సాయి ప్రణీత్ పరాజయాలు పొందినా…డబుల్స్ , మూడో సింగిల్స్ లో నెగ్గడం ద్వారా భారత్ విజేతగా నిలిచింది.
ప్రారంభ సింగిల్స్ లో సాయి ప్రణీత్ 21-14, 14-21, 12-21తోనూ, రెండో సింగిల్స్ లో కిడాంబీ శ్రీకాంత్..20-22, 14-21తో పరాజయాలు పొందడంతో భారత్ 0-2తో వెనుకబడిపోయింది.
అయితే… తొలిడబుల్స్ లో భారత జోడీ 21-18, 22-20తోనూ, రెండో జోడీ 21-15,16-21, 21-15 తోనూ విజయాలు సాధించారు. మూడో సింగిల్స్ లో యువఆటగాడు లక్ష్యసేన్ 21-19, 21-18తో నెగ్గడం ద్వారా భారత్ కు 3-2తో అనూహ్య విజయం అందించగలిగారు.
సెమీఫైనల్లో ఇండోనీషియాతో భారత్, జపాన్ తో మలేసియాజట్లు ఢీ కొంటాయి. సెమీస్ లో భారత్ ఓడినా కాంస్య పతకం దక్కించుకోగలుగుతుంది.
మహిళల సెమీస్ లో జపాన్ తో మలేసియా, థాయ్ లాండ్ తో కొరియా అమీతుమీ తేల్చుకోనున్నాయి.