కేసీఆర్ మాటను కాదని మరీ.... జగన్ ఏం చేశారో తెలుసా?
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మధ్య.. ప్రభుత్వాల పరంగా ఎంతటి సన్నిహిత సంబంధాలు ఉన్నాయో అందరికీ తెలిసిందే. ఇరు రాష్ట్రాల ప్రయోజనాల దృష్ట్యా ఇరువురు నేతలు ఇప్పటికే రెండు మూడు పర్యాయాలు సమావేశమై సుదీర్ఘంగా చర్చించారు. కృష్ణా జలాల తరలింపు సహా మరిన్ని విషయాలపై మాట్లాడుకున్నారు. ఉభయ రాష్ట్రాల మధ్య సుహృద్భావ వాతావరణానికి తమ వంతు కృషి చేస్తున్నారు. ఇలాంటి సందర్భంలో తన రాజకీయ అనుభవాన్ని ఉపయోగించి.. కేసీఆర్, జగన్.. […]
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మధ్య.. ప్రభుత్వాల పరంగా ఎంతటి సన్నిహిత సంబంధాలు ఉన్నాయో అందరికీ తెలిసిందే. ఇరు రాష్ట్రాల ప్రయోజనాల దృష్ట్యా ఇరువురు నేతలు ఇప్పటికే రెండు మూడు పర్యాయాలు సమావేశమై సుదీర్ఘంగా చర్చించారు. కృష్ణా జలాల తరలింపు సహా మరిన్ని విషయాలపై మాట్లాడుకున్నారు. ఉభయ రాష్ట్రాల మధ్య సుహృద్భావ వాతావరణానికి తమ వంతు కృషి చేస్తున్నారు.
ఇలాంటి సందర్భంలో తన రాజకీయ అనుభవాన్ని ఉపయోగించి.. కేసీఆర్, జగన్.. సలహాలు ఇచ్చి పుచ్చుకునే వాతావరణం కూడా ఇరువురి మధ్య ఉందనేందుకు.. తాజాగా ఓ విషయం ఉదాహరణగా నిలుస్తోంది. మరో విశేషం ఏంటంటే.. కేసీఆర్ ఇచ్చిన సలహాను కాదని మరీ.. తన నిర్ణయాన్ని అమలు చేసి జనంతో శభాష్ అనిపించుకున్న జగన్ అడుగులు.. అందరినీ ఆలోచింపజేస్తున్నాయి. మంత్రి పేర్ని నాని చెప్పిన ఈ విషయం.. సంచలనంగా మారింది.
ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తే.. జీతాల చెల్లింపు వ్యవహారం గుదిబండగా మారుతుందని… అలా చేయవద్దని జగన్ కు కేసీఆర్ సలహా ఇచ్చారట. అప్పుడు మరింత పట్టుదల పెరిగి.. తాను అనుకున్న పనిని ఆర్టీసీ కార్మికుల సంక్షేమం కోసం మరింత పట్టుదలగా జగన్ పూర్తి చేశారట. ఈ విషయాన్ని మంత్రి పేర్ని నాని మీడియా సమావేశంలో చెప్పుకొచ్చారు. జనానికి మంచి జరుగుతుంది అనుకుంటే.. జగన్ ఎందాకైనా వెళ్తారనేందుకు ఇది ఓ నిదర్శనమని ముఖ్యమంత్రి అభిమానులు వ్యాఖ్యానిస్తున్నారు.