పవన్-క్రిష్ సినిమా అప్ డేట్స్
పవన్-క్రిష్ సినిమా ప్రారంభమైన సంగతి తెలిసిందే. లాంఛనంగా ఫస్ట్ షెడ్యూల్ కూడా పూర్తిచేశారు. అంటే ఒక రోజు మాత్రమే పవన్ తో షూటింగ్ చేసి, మిగతా రోజులు ఇతర నటీనటులతో షూటింగ్ కంప్లీట్ చేశారు. ఇప్పుడీ సినిమాకు పూర్తిస్థాయిలో కాల్షీట్లు కేటాయించాడు పవన్. వచ్చే సోమవారం నుంచి ఏకథాటిగా 10 రోజుల పాటు క్రిష్ మూవీ షూటింగ్ ఉంటుంది. ఇప్పటికే పింక్ రీమేక్ (వకీల్ సాబ్)ను సగం పూర్తిచేశాడు పవన్ కల్యాణ్. ఈ సినిమాకు కేవలం 30 […]
పవన్-క్రిష్ సినిమా ప్రారంభమైన సంగతి తెలిసిందే. లాంఛనంగా ఫస్ట్ షెడ్యూల్ కూడా పూర్తిచేశారు. అంటే ఒక రోజు మాత్రమే పవన్ తో షూటింగ్ చేసి, మిగతా రోజులు ఇతర నటీనటులతో షూటింగ్ కంప్లీట్ చేశారు. ఇప్పుడీ సినిమాకు పూర్తిస్థాయిలో కాల్షీట్లు కేటాయించాడు పవన్. వచ్చే సోమవారం నుంచి ఏకథాటిగా 10 రోజుల పాటు క్రిష్ మూవీ షూటింగ్ ఉంటుంది.
ఇప్పటికే పింక్ రీమేక్ (వకీల్ సాబ్)ను సగం పూర్తిచేశాడు పవన్ కల్యాణ్. ఈ సినిమాకు కేవలం 30 రోజులు కాల్షీట్లు మాత్రమే కేటాయించాడు. క్రిష్ సినిమాకు మాత్రం దాదాపు 60 కాల్షీట్లు అవసరం అవుతాయి. ఈ మేరకు తన పొలిటికల్ కార్యక్రమాల్ని కూడా పవన్ సర్దుబాటు చేసుకున్నాడు. ఈ రెండు సినిమాలు కంప్లీట్ అయిన తర్వాత అప్పుడు హరీష్ శంకర్ దర్శకత్వంలో సినిమాను స్టార్ట్ చేస్తాడు.
క్రిష్ సినిమాకు ఏఎం రత్నం నిర్మాత. ఈ సినిమా కోసం మెగాసూర్యా మూవీస్ అనే కొత్త బ్యానర్ స్థాపించాడు రత్నం. పూర్తిగా ఫైనాన్స్ మీద ఆధారపడి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. అంటే.. షూటింగ్ ప్రారంభమైన మొదటి రోజు నుంచి వడ్డీలు కూడా ప్రారంభమన్నమాట. అందుకే వడ్డీ భారాన్ని తగ్గించుకునేందుకు.. ఆల్రెడీ శాటిలైట్, డిజిటల్ మార్కెట్ ను ఓపెన్ చేశారు. ఆ రూపేణా డబ్బులు వస్తే.. కాస్త వడ్డీ భారం నుంచి తప్పించుకోవచ్చనేది రత్నం ఆలోచన.