అమిత్ షాతో జగన్ భేటీ ఎందుకు ?
కేంద్ర కేబినెట్‌లో చేరాలని ఏపీ సీఎం జగన్‌ను ప్రధానమంత్రి మోదీ ఆహ్వానించారు. ప్రధానితో గంటన్నరకు పైగా సాగిన సమావేశంలో ఈ అంశంపై ఎక్కువ టైమ్ చర్చ జరిగింది. రెండు రోజులుగా మీడియాలో వినిపిస్తున్న మాట. కేంద్ర కేబినెట్‌లో వైసీపీ చేరుతుందని రెండు రోజులుగా ఢిల్లీ బీజేపీ నేతలు లీకుల మీద లీకులు ఇస్తున్నారు. జగన్‌కు ప్రధాని ఈ విషయం చెప్పారనేది వీరి వెర్షన్. అయితే ఈ వార్తలను వైసీపీ ఖండిస్తోంది. అలాంటి ఆఫర్ తమ దగ్గరకు రాలేదని […]
కేంద్ర కేబినెట్‌లో చేరాలని ఏపీ సీఎం జగన్‌ను ప్రధానమంత్రి మోదీ ఆహ్వానించారు. ప్రధానితో గంటన్నరకు పైగా సాగిన సమావేశంలో ఈ అంశంపై ఎక్కువ టైమ్ చర్చ జరిగింది. రెండు రోజులుగా మీడియాలో వినిపిస్తున్న మాట.
కేంద్ర కేబినెట్‌లో వైసీపీ చేరుతుందని రెండు రోజులుగా ఢిల్లీ బీజేపీ నేతలు లీకుల మీద లీకులు ఇస్తున్నారు. జగన్‌కు ప్రధాని ఈ విషయం చెప్పారనేది వీరి వెర్షన్. అయితే ఈ వార్తలను వైసీపీ ఖండిస్తోంది. అలాంటి ఆఫర్ తమ దగ్గరకు రాలేదని అంటోంది. ఒక వేళ వచ్చినా కేంద్ర కేబినెట్‌లో చేరేది లేదని ఇప్పటికే స్పష్టం చేస్తోంది.
ఈవిషయంలో అమిత్ షాతో చర్చించాలని మోదీ సూచించారట. అందుకే జగన్… అమిత్ షా ను కలుస్తున్నారని ఢిల్లీలో ఉండే బీజేపీ నాయకులు కొందరు మీడియా ప్రతినిధులకు లీకుల మీద లీకులు ఇస్తున్నారు. అయితే ఈ విషయంలో మాత్రం క్లారిటీ రాలేదు.
ఢిల్లీ ఎన్నికల తర్వాత ప్రాంతీయ పార్టీల బలం పెరుగుతోంది. వీరంతా కలిసి కూటమి కట్టే అవకాశం ఉంది. కేసీఆర్, జగన్, స్టాలిన్, నవీన్ పట్నాయక్, కేజ్రీవాల్, నితీష్ కుమార్, మమతా బెనర్జీ వీరు కలిసి కూటమిగా ఏర్పడితే రాబోయేరోజుల్లో బీజేపీకి కష్టం కాలం. అందులో భాగంగా ఈ కూటమికి ఆదిలోనే చెక్ పెట్టేందుకు బీజేపీ ప్రయత్నిస్తుందనేది రాజకీయ పరిశీలకుల మాట.
ఇందులో భాగంగా ఎన్డీయేలోకి కీలకమైన ప్రాంతీయ పార్టీలను ఆహ్వానిస్తోందట. ఈ విషయం తెలిసిన జగన్… మోదీ ఆఫర్‌ను సున్నితంగా తిరస్కరించారని అంటున్నారు. అంశాల వారీగా కేంద్రానికి తమ మద్దతు ఉంటుందని చెప్పారట.
మొత్తానికి అమిత్ షాతో మీటింగ్ తర్వాత కేంద్ర మంత్రి వర్గ విస్తరణ ఉంటుందా? అందులో వైసీపీకి ఆఫర్ ఇచ్చారా? లేదా అనే విషయం తేలుతుందని ఢిల్లీ వర్గాలు చెబుతున్నాయి .