Telugu Global
Cinema & Entertainment

దిల్ రాజ్ పునర్వివాహం వెనకున్నది ప్రకాష్ రాజా?

టాలీవుడ్ అగ్ర నిర్మాత, ఎంతో చురుకైన పంపిణీదారు అయిన దిల్ రాజు మళ్లీ వివాహం చేసుకోబోతున్నాడనే వార్త బాగా వైరల్ అయిన సంగతి తెలిసిందే.. ఫిలింనగర్ లో దిల్ రాజు ఎవరిని పెళ్లి చేసుకుంటారనేది ఆసక్తిగా మారింది. దిల్ రాజు భార్య గత ఏడాది మరణించింది. ఆయన భార్య పోయిన సంవత్సరం గుండెపోటుతో హఠాత్ మరణం చెందారు.. దిల్ రాజుకు పిల్లలకు పిల్లలు కూడా పుట్టారు. ఇద్దరు మనవళ్లు ఆయనకున్నారు. అయితే దిల్ రాజు వయసు పెరిగినా […]

దిల్ రాజ్ పునర్వివాహం వెనకున్నది ప్రకాష్ రాజా?
X

టాలీవుడ్ అగ్ర నిర్మాత, ఎంతో చురుకైన పంపిణీదారు అయిన దిల్ రాజు మళ్లీ వివాహం చేసుకోబోతున్నాడనే వార్త బాగా వైరల్ అయిన సంగతి తెలిసిందే.. ఫిలింనగర్ లో దిల్ రాజు ఎవరిని పెళ్లి చేసుకుంటారనేది ఆసక్తిగా మారింది.

దిల్ రాజు భార్య గత ఏడాది మరణించింది. ఆయన భార్య పోయిన సంవత్సరం గుండెపోటుతో హఠాత్ మరణం చెందారు.. దిల్ రాజుకు పిల్లలకు పిల్లలు కూడా పుట్టారు. ఇద్దరు మనవళ్లు ఆయనకున్నారు. అయితే దిల్ రాజు వయసు పెరిగినా కూడా అలా కనిపించరు. చాలా యంగ్ గానే కనిపిస్తాడు. ఆరోగ్యకరమైన తిండి, వ్యాయమాలు చేస్తాడని.. అందుకే ఆయన యంగ్ లా కనిపిస్తారని చెబుతుంటారు.

అయితే భార్య అనిత మరణించాక ఏడాది తర్వాత దిల్ రాజు రెండో వివాహానికి సన్నాహాలు చేస్తున్నారని టాలీవుడ్ ఇండస్ట్రీ వర్గాల్లో వార్త చక్కర్లు కొడుతోంది. అయితే దిల్ రాజు మనుసు మార్చింది విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ అని సమాచారం. తాను 50 ఏళ్ల వయసులో రెండో పెళ్లిచేసుకున్నానని… నువ్వు కూడా చేసుకుంటే తప్పేంటని ప్రకాష్ రాజ్ సలహా ఇచ్చారట. మధ్య వయసులో, రిటైర్ మెంట్ ఏజ్ లో జీవిత భాగస్వామిని కలిగి ఉండడం ఎంత ముఖ్యమో వివరించారట.

దీంతో కుటుంబ సభ్యులు, ప్రకాష్ రాజ్ లాంటి వారి సలహాతో దిల్ రాజు కూడా మళ్లీ పెళ్లికి ఒప్పుకున్నాడట.. దిల్ రాజు కు కాబోయే వధువు గురించి ఆయన కుటుంబ సభ్యులందరికీ తెలుసునని చెబుతున్నారు. వచ్చే మాఘ మాసం ముగిసేలోపు దిల్ రాజ్ కు పెళ్లి చేయడానికి రెడీ అవుతున్నారట.

First Published:  14 Feb 2020 8:40 AM IST
Next Story