Telugu Global
NEWS

కివీటూర్ లో విరాట్ సేన ఆటవిడుపు

బ్లూస్ర్పింగ్స్ లో సేదతీరిన విరుష్క అండ్ కో నెలరోజుల న్యూజిలాండ్ పర్యటనలో ఆఖరి అంచె టెస్ట్ సిరీస్ సమరానికి ముందు దొరికిన విరామసమయాన్ని విరాట్ కొహ్లీ అండ్ కో…ప్రకృతి అందాలనడుమ సేదతీరటానికి వినియోగించుకొంటున్నారు. ఆటవిడుపుగా హామిల్టన్ సమీపంలోని ప్రకృతి అందాలనెలవు బ్లూ స్ప్ర్రింగ్స్ లో సేదతీరారు.కెప్టెన్ విరాట్ కొహ్లీ, అతని భార్య అనుష్కతో పాటు…టెస్ట్ సిరీస్ లో పాల్గొనే మిగిలిన ఆటగాళ్లంతా బ్లూ స్ప్ర్రింగ్స్ పర్యటనలో పాల్గొన్నారు. న్యూజిలాండ్ తో జరిగిన తొలి అంచె 5 మ్యాచ్ […]

కివీటూర్ లో విరాట్ సేన ఆటవిడుపు
X
  • బ్లూస్ర్పింగ్స్ లో సేదతీరిన విరుష్క అండ్ కో

నెలరోజుల న్యూజిలాండ్ పర్యటనలో ఆఖరి అంచె టెస్ట్ సిరీస్ సమరానికి ముందు దొరికిన విరామసమయాన్ని విరాట్ కొహ్లీ అండ్ కో…ప్రకృతి అందాలనడుమ సేదతీరటానికి వినియోగించుకొంటున్నారు. ఆటవిడుపుగా హామిల్టన్ సమీపంలోని ప్రకృతి అందాలనెలవు బ్లూ స్ప్ర్రింగ్స్ లో సేదతీరారు.కెప్టెన్ విరాట్ కొహ్లీ, అతని భార్య అనుష్కతో పాటు…టెస్ట్ సిరీస్ లో పాల్గొనే మిగిలిన ఆటగాళ్లంతా బ్లూ స్ప్ర్రింగ్స్ పర్యటనలో పాల్గొన్నారు.

న్యూజిలాండ్ తో జరిగిన తొలి అంచె 5 మ్యాచ్ ల టీ-20 సిరీస్ లో క్లీన్ స్వీప్ సాధించిన విరాట్ సేన..ఆ తర్వాత జరిగిన తీన్మార్ వన్డే సిరీస్ లో చిత్తుగా ఓడింది.

రెండువారాల వ్యవధిలో ఎనిమిది మ్యాచ్ లు ఆడి అలసిపోయిన భారత క్రికెటర్లు…ఈ నెల 21 నుంచి ప్రారంభంకానున్న రెండుమ్యాచ్ ల టెస్ట్ సిరీస్ లో పాల్గొనటానికి ముందు పునరుత్తేజం పొందటానికి…ప్రకృతి ఒడిలో సేదతీరాలని నిర్ణయించారు. అందులో భాగంగానే టీమ్ మేనేజ్ మెంట్…బ్లూ స్ప్ర్రింగ్స్ సందర్శనకు ఏర్పాట్లు చేసింది.

భారత క్రికెట్ నయావాల్ చతేశ్వర్ పూజారా, యువఓపెనర్లు పృధ్వీ షా, మయాంక్ అగర్వాల్, ఫాస్ట్ బౌలర్లు ఉమేశ్ యాదవ్, నవదీప్ సైనీ, మహ్మద్ షమీతో సహా మిగిలిన సభ్యులు సైతం పాల్గొన్నారు.

బ్లూ స్ప్ర్రింగ్స్ పరిసర ప్రాంతాలలో ప్రకృతి అందాలను ఆస్వాదిస్త్తూ గంటన్నర పాటు కాలినడకన సంచరించడం సరికొత్త ఉత్సాహాన్ని ఇచ్చిందని యువఆటగాడు శుభమన్ గిల్ తన అనుభవాన్ని పంచుకొన్నాడు.

ఐసీసీ టెస్ట్ చాంపియన్షిప్ లీగ్ లో భాగంగా న్యూజిలాండ్ తో ఈనెల 21 నుంచి జరిగే తొలిటెస్ట్ కు వెలింగ్టన్, 29న ప్రారంభమయ్యే రెండోటెస్ట్ కు క్ర్రైస్ట్ చర్చి ఆతిథ్యమివ్వనున్నాయి.

లీగ్ లో టెస్ట్ ప్రపంచ నంబర్ వన్ భారత్ ఇప్పటి వరకూ ఆడిన మూడుకు మూడు టెస్టు సిరీస్ ల్లోనూ క్లీన్ స్వీప్ సాధించడం ద్వారా 360 పాయింట్లతో టేబుల్ టాపర్ గా నిలిచింది.

వెస్టిండీస్ తో రెండు, సౌతాఫ్రికాతో మూడుమ్యాచ్ లు, బంగ్లాదేశ్ తో ముగిసిన రెండుమ్యాచ్ ల సిరీస్ లను భారత్ అలవోకగా నెగ్గడం ద్వారా..సంపూర్ణ ఆధిపత్యాన్ని చాటుకోగలిగింది.

First Published:  14 Feb 2020 2:58 AM IST
Next Story