Telugu Global
NEWS

పవన్‌ కళ్యాణ్‌ది దగ్గుబాటి పరిస్థితేనా?

వ్యక్తిత్వాల్లో ఇద్దరికీ పోలికే లేదు. దగ్గుబాటిది నింపాది మనస్తత్వం…. పవన్‌ కళ్యాణ్‌ది దందుడుకు మనస్తత్వం, చంచల స్వభావం. దగ్గుబాటిది స్థిరమైన ఆలోచనా విధానం. పవన్‌ కళ్యాణ్‌ది గందరగోళపు ఆలోచనా విధానం. దగ్గుబాటి చదువుకున్న వాడు. పవన్‌ కళ్యాణ్‌ అందరికన్నా గొప్పగా చదువుకున్నానని చెప్పుకునేవాడు…. ఇలా పోల్చుకుంటూ పోతే ఇద్దరికీ పొలికే లేదు. అయితే ఇద్దరికీ ఒక విషయంలో సారూప్యం కనపడబోతోంది. అదేమిటంటే… ఒక్కసారిగా పొలిటికల్‌గా జీరో కావడం. దగ్గుబాటి వెంకటేశ్వరరావు వరకు వస్తే ఆయన పార్టీలు మారి […]

పవన్‌ కళ్యాణ్‌ది దగ్గుబాటి పరిస్థితేనా?
X

వ్యక్తిత్వాల్లో ఇద్దరికీ పోలికే లేదు. దగ్గుబాటిది నింపాది మనస్తత్వం…. పవన్‌ కళ్యాణ్‌ది దందుడుకు మనస్తత్వం, చంచల స్వభావం. దగ్గుబాటిది స్థిరమైన ఆలోచనా విధానం. పవన్‌ కళ్యాణ్‌ది గందరగోళపు ఆలోచనా విధానం.

దగ్గుబాటి చదువుకున్న వాడు. పవన్‌ కళ్యాణ్‌ అందరికన్నా గొప్పగా చదువుకున్నానని చెప్పుకునేవాడు…. ఇలా పోల్చుకుంటూ పోతే ఇద్దరికీ పొలికే లేదు. అయితే ఇద్దరికీ ఒక విషయంలో సారూప్యం కనపడబోతోంది. అదేమిటంటే… ఒక్కసారిగా పొలిటికల్‌గా జీరో కావడం.

దగ్గుబాటి వెంకటేశ్వరరావు వరకు వస్తే ఆయన పార్టీలు మారి బీజేపీలోకి వెళ్ళారు. అప్పటికి ఏపీ బీజేపీకి చెప్పుకోదగ్గ నాయకుడు ఒక్కరూ లేరు. నిజానికి దగ్గుబాటి ఆ పార్టీలో స్థిరపడిపోయి ఉంటే ఇప్పుడు ఏపీలో బీజేపీకి తిరుగులేని నాయకుడిగా ఉండేవారు. ఆయన దురదృష్టం కొద్ది బీజేపీతో చంద్రబాబు మిలాకత్‌ కావడంతో దగ్గుబాటి పరిస్థితి అయోమయం, అగమ్యగోచరం అయిపోయింది. దాంతో ఆ పార్టీ నుంచి బయటకు వచ్చి అనామకుడిగా మిగిలిపోయాడు.

ఇప్పుడు పవన్‌ కళ్యాణ్‌ పరిస్థితి కూడా అదే కాబోతోందా?… ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ త్వరలో నామరూపాలు లేకుండా పోబోతోంది. ఆ విషయాన్ని అందరికన్నా ముందు గ్రహించిన చంద్రబాబు… తనకు అత్యంత ఆత్మీయులను బీజేపీలోకి స్వయంగా పంపించారు.

పవన్‌ కళ్యాణ్‌ జనసేనను నడిపే పరిస్థితి లేదు. ఆ పార్టీకి బలమైన క్యాడర్‌ ఉంది. పార్టీకి వీరాభిమానులు ఉన్నారు. అయితే ఏ పార్టీకి లేని గందరగోళపు నాయకుడు ఈ పార్టీకి ఉన్నాడు. మంచోచెడో ప్రతి నాయకుడికీ వ్యక్తిత్వం ఉంటుంది. ఏమాత్రం వ్యక్తిత్వం లేని, స్థిర అభిప్రాయాలు లేని, ప్రణాళిక లేని దుందుడుకు నాయకుడు పవన్‌ కళ్యాణ్‌.

ఈయన నాయకత్వంలో పార్టీ బలపడే అవకాశమే లేదు. పవన్‌ టీడీపీలో చేరే పరిస్థితే లేదు. ఇక మిగిలింది బీజేపీ. బీజేపీలో పార్టీని విలీనం చేయడమో… బీజేపీతో కలిసి అధికార పార్టీకి వ్యతిరేకంగా పోరాడడమో పవన్‌ చేస్తాడని రాజకీయ విశ్లేషకులంతా భావించారు.

అయితే మారిన దేశ రాజకీయ పరిస్థితుల నేపధ్యంలో బీజేపీ వైసీపీకి స్నేహ హస్తం చాస్తోందని వార్తలు వస్తున్నాయి. అదే జరిగితే పవన్‌ కళ్యాణ్‌ ఆటలో అరటిపండే… తిరునాళ్ళలో తప్పిపోయిన పిల్లోడిలాగా రాజకీయ చౌరస్తాలో అమాయకంగా, అనామకంగా మిగిలిపోయే పరిస్థితి… గతంలో దగ్గుబాటి లాగే…!

First Published:  14 Feb 2020 3:00 AM IST
Next Story