Telugu Global
National

ఐటీ రైడ్స్‌లో టీడీపీ నేతల 2 వేల కోట్ల అక్రమ లావాదేవీలు... ఐటీ శాఖ ప్రకటన

ఏపీ తెలంగాణలో ఇటీవల ఐటీ శాఖ నిర్వహించిన దాడులపై ఆశాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. విశాఖ, విజయవాడ, పుణే, కడప, హైదరాబాద్‌లో ఇటీవల ఆదాయపు పన్ను శాఖ కీలక నేతల ఇళ్ళల్లో సోదాలు నిర్వహించింది. ఇందులో రెండు వేల కోట్ల లెక్క చూపని లావాదేవీలు గుర్తించినట్లు తెలిపింది. కీలకమైన కాంట్రాక్టర్లు తమకు చెందిన సబ్‌ కాంట్రాక్టర్ల ద్వారా ఈ లావాదేవీలు జరిపినట్లు ఐటీ అధికారులు గుర్తించారు. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణకు చెందిన మూడు కంపెనీల్లో ఈ దాడులు […]

ఐటీ రైడ్స్‌లో టీడీపీ నేతల 2 వేల కోట్ల అక్రమ లావాదేవీలు... ఐటీ శాఖ ప్రకటన
X

ఏపీ తెలంగాణలో ఇటీవల ఐటీ శాఖ నిర్వహించిన దాడులపై ఆశాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. విశాఖ, విజయవాడ, పుణే, కడప, హైదరాబాద్‌లో ఇటీవల ఆదాయపు పన్ను శాఖ కీలక నేతల ఇళ్ళల్లో సోదాలు నిర్వహించింది. ఇందులో రెండు వేల కోట్ల లెక్క చూపని లావాదేవీలు గుర్తించినట్లు తెలిపింది. కీలకమైన కాంట్రాక్టర్లు తమకు చెందిన సబ్‌ కాంట్రాక్టర్ల ద్వారా ఈ లావాదేవీలు జరిపినట్లు ఐటీ అధికారులు గుర్తించారు.

ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణకు చెందిన మూడు కంపెనీల్లో ఈ దాడులు నిర్వహించారు. ఈ సోదాల్లో 85 లక్షల నగదు, 71 లక్షల విలువైన నగలు సీజ్‌ చేశారు. అయితే పెద్దగా డబ్బు దొరకలేదు. కానీ బోగస్‌ సబ్‌ కాంట్రాక్టర్ల పేరుతో పెద్ద ఎత్తున అక్రమ లావాదేవీలు జరిగినట్లు ఐటీ అధికారుల సోదాల్లో బయటపడింది.

బోగస్‌ ఇన్‌వాయిస్‌లు, తప్పుడు బిల్లులు, తప్పుడు పత్రాలతో పాటు ఖాళీ పేపర్లను స్వాధీనం చేసుకున్నారు. వాట్సాప్‌ , ఈమెయిళ్లలో కూడా జరిగిన మెసేజ్‌లను సమాచారం రూపంలో సేకరించారు. విదేశీ లావాదేవీలును కూడా గుర్తించారు.

First Published:  13 Feb 2020 4:13 PM IST
Next Story