మంత్రి గారు తేల్చేశారు.... త్వరలో విశాఖ నుంచే పాలన మొదలు
మూడు రాజధానులపై మరో అడుగు ముందుకు పడనుంది. త్వరలో జరగనున్న బడ్జెట్ సమావేశాల తర్వాత ఏ క్షణాన్నైనా విశాఖ నుంచి పాలన మొదలు కానుంది. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రరారెడ్డి ఈ విషయాన్ని ప్రకటించారు. అన్నీ కుదిరితే ఏప్రిల్ లో.. ఈ నిర్ణయం అమలయ్యే అవకాశం ఉంది. మున్సిపల్ ఎన్నికలు నిర్వహించాలనే ఆలోచనలో ఉన్న ప్రభుత్వం.. ఆ వెంటనే బడ్జెట్ సమావేశాలు పూర్తి చేసి.. వెను వెంటనే విశాఖ నుంచి పాలన చేసే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. బడ్జెట్ […]
మూడు రాజధానులపై మరో అడుగు ముందుకు పడనుంది. త్వరలో జరగనున్న బడ్జెట్ సమావేశాల తర్వాత ఏ క్షణాన్నైనా విశాఖ నుంచి పాలన మొదలు కానుంది. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రరారెడ్డి ఈ విషయాన్ని ప్రకటించారు. అన్నీ కుదిరితే ఏప్రిల్ లో.. ఈ నిర్ణయం అమలయ్యే అవకాశం ఉంది.
మున్సిపల్ ఎన్నికలు నిర్వహించాలనే ఆలోచనలో ఉన్న ప్రభుత్వం.. ఆ వెంటనే బడ్జెట్ సమావేశాలు పూర్తి చేసి.. వెను వెంటనే విశాఖ నుంచి పాలన చేసే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. బడ్జెట్ సమావేశాల తర్వాత విశాఖ నుంచే పాలన అన్న మంత్రి పెద్దిరెడ్డి వ్యాఖ్యలు ఇందుకు నిదర్శనంగా నిలుస్తున్నాయి.
ముఖ్యమంత్రికి ఎక్కడి నుంచైనా పాలించే హక్కు ఉంటుందని చెప్పిన ఆయన.. త్వరలోనే 3 రాజధానుల నిర్ణయాన్ని అమలు చేస్తున్న విషయాన్ని మాత్రం మరింతగా స్పష్టీకరించారు. ఇప్పటికే కర్నూలుకు విజిలెన్స్ కార్యాలయాల తరలింపు పని కానిస్తున్నారు. విశాఖలో పాలనకు, సిబ్బందికి అవసరమైన భవనాలు వెతుకుతున్నారు. మరో నెలలోపు ఈ కసరత్తు పూర్తి చేసేలా కార్యాచరణ అమలవుతోంది.
ఈ చర్యలపై స్పష్టత వచ్చేలోపు.. శాసనసభ పద్దుల సమావేశాలూ పూర్తవుతాయి. ఆ వెంటనే విశాఖపట్నం కార్యనిర్వాహక రాజధానిగా కొత్త రూపం సంతరించుకోవడం.. తాజా పరిణామాల ప్రకారం ఖాయంగా కనిపిస్తోంది.